Ram Charan : రామ్ చరణ్, బుచ్చిబాబు రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమాపై అందరిలోనూ అంచనాలున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో చరణ్ క్రికెటర్ గా కనిపించబోతున్నాడని టాక్. దీంతో పాటు ఓ అథ్లెట్ గానూ కనిపిస్తాడు అంటున్నారు. ఏదైనా ఇందులో అతను ఓ స్పోర్ట్స్ మేన్ గా నటిస్తున్నాడు అనేది నిజం. ఇక బుచ్చిబాబు ఈ మూవీతో ప్యాన్ ఇండియా స్థాయిలో షైన్ అవుతాడనే టాక్ కూడా ఉంది. మొత్తంగా చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ మూవీకి కొన్ని రోజులు బ్రేక్ వచ్చింది. కొత్త షెడ్యూల్ కోసం రూపొందిస్తోన్న సెట్స్ కాస్త ఆలస్యం అయ్యాయట. అందుకే ఈ బ్రేక్. తర్వాత నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతుంది.
ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఓ కన్ఫ్యూజన్ ఉంది. ఎప్పుడు విడుదలవుతుందా అనేది క్లారిటీ లేదు. బట్ లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటున్నారు. మూవీ ఓపెనింగ్ టైమ్ లో అంతా ఊహించినట్టుగానే ఈ యేడాది దీపావళికి రిలీజ్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ 16 అనే డేట్ ను కూడా ఫిక్స్ చేశారంటున్నారు. ఈ యేడాది దసరా కాస్త అర్లీగా అక్టోబర్ 2న వచ్చింది. దీపావళి 18న సో.. దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారట. ఒకవేళ అంతా అనుకున్నట్టుగా జరిగితే కాస్త ముందుకు వచ్చి దసరాకే రావొచ్చు.. తేడా వస్తే క్రిస్మస్ వరకూ ఆగొచ్చు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com