ప్రేమలో విఫలం.. ఆ బాధ నాకు తెలుసు: రేణూ దేశాయ్

ప్రేమలో విఫలం.. ఆ బాధ నాకు తెలుసు: రేణూ దేశాయ్
రేణూ చాలా రోజుల తర్వాత అభిమానులతో ముచ్చటించేందుకు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చారు.

ప్రాణంగా ప్రేమించిన వారు తమని దూరం పెడితే ఆ బాధని తట్టుకోవడం కష్టం.. కానీ తప్పదు బయటికి రావాలి. ప్రేమలో విఫలమైనంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం సరికాదు అని రేణూ దేశాయ్ అన్నారు. రేణూ చాలా రోజుల తర్వాత అభిమానులతో ముచ్చటించేందుకు ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చారు. పలువురు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ప్రేమలో విఫలమైతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు.. ఎంతగానో ప్రేమించిన వ్యక్తి మన పక్కన లేడని, మనం మోసపోయామని అనిపించినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం తప్పు. నీ జీవితం, నీ ప్రాణం కంటే ఎవరూ ముఖ్యం కాదు.

కుటుంబ సభ్యులు, స్నేహితులు, కౌన్సిలింగ్ సాయంతో ఆ బాధ నుంచి బయటకు రావాలి. అదే తల్చుకుంటూ కుమిలిపోతే జీవితంలో ముందుకు సాగలేం. జీవితమంటేనే ఎన్నో ఆటుపోట్లు.. వాటన్నింటిని ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడాలి.. మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ, మీకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అంతే కాని చిన్న చిన్న వాటికి కృంగిపోకూడదని సూచించారు అభిమానులకు రేణూదేశాయ్.

Tags

Next Story