Renu Desai: ఇది సరదా సమయం కాదు.. సాయం చేసే సమయం.. దయచేసి అలాంటి పోస్టులు: రేణూ ఆగ్రహం

Renu Desai: మహమ్మారి కోవిడ్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మాటలతో కాలక్షేపం చేయక ఎవరికి తోచిన సాయం వారు చేస్తే బాధితులకు కొంత ఊరట కలుగుతుంది. అదే విషయాన్ని నటి రేణూ దేశాయ్ వివరిస్తున్నారు. ప్రస్తుతం తాను అదే పని చేస్తూ బిజీగా ఉన్నానని అంటున్నారు.
ఇన్ స్టా వేదికగా ఆమె ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది సరదా సంగతులు మాట్లాడుకునే సమయం కాదు.. ఇకపై తనకి హాయ్, హలో లాంటి మెసేజ్ లు పెట్టవద్దని నెటిజన్లకు తెలియజేశారు. ఇలాంటి మెసేజ్ ల వల్ల సాయం కోరుతూ పెట్టే మెసేజ్ లు కిందకు వెళ్లి పోతున్నాయి.
వాటిని నేను మళ్లీ చూడలేకపోతున్నాను. దీని వలన చాలా మంది సమయానికి సాయం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే నేను ప్రస్తుతానికి ఎవరికీ ఆర్థిక సాయం అందించట్లేదు. కోవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి ఆసుపత్రులు, మందుల విషయంలో నాకు చేతనైనంత సాయం చేస్తున్నాను అని ఓ వీడియో పోస్ట్ చేశారు. అంతే కాకుండా తన పేరుతో ట్విట్టర్ లో ఉన్న ఖాతాని ఎవరూ ఫాలో కావొద్దని అది తనది కాదని పేర్కొన్నారు.
ప్రస్తుతానికి దేశానికి కావలసింది సోనూసూద్ లాంటి వ్యక్తులు. పథకాలతో పని జరగదు. ఓ వ్యక్తికి నిజమైన అవసరం ఏమిటో తెలుసుకుని దాన్ని అందించాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో వారికి కూడా నావంతు సాయం చేస్తున్నా. ఇప్పటి వరకు 600 మందికి సాయం చేశానని తెలిపారు. దయచేసి ఎవరూ కరోనా మరణ వార్తలు చదవొద్దని ఆమె అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com