Renu Desai: గత కొంత కాలంగా బాధపడుతున్నా..: రేణూ దేశాయ్

Renu Desai: రేణు దేశాయ్ ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ, సినిమాల్లో కానీ, బుల్లి తెర మీద కానీ కనిపించట్లేదు. ఏమై ఉంటుందో అని అందరూ అనుకున్నారు.. ఇప్పుడు తనే పోస్ట్ పెట్టడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. నటీ నటులకు అనారోగ్య సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యాయి. రేణూ కూడా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధ పడుతున్నట్లు పోస్ట్ చేశారు. తనతో క్లోజ్‌గా ఉన్నవారికి తప్పించి మరెవరికీ తన అనారోగ్యం గురించి తెలియదని అందులో పేర్కొన్నారు.
మందులు వాడుతూ, మంచి పోషకాహారం తీసుకుంటూ, యోగా చేస్తూ అనారోగ్యం నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. త్వరలో కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటాను అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్కోసారి కష్టంగా అనిపిస్తుంది. అయినా నాకు నేనే ధైర్యాన్ని చెప్పుకుంటాను.
ఈ రోజు నేను ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి కూడా కారణం అదే. మనలో చాలా మంది వివిధ సమస్యలతో పోరాడుతున్న వారు ఉన్నారు. ఎప్పుడు మీ మీద మీకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకండి. ధైర్యంగా ఉండండి. మీరు మీ జీవితంపై ఆశను పెంచుకోండి.
విశ్వం మనకోసం ఏదో ఒక ప్రణాళికను సిద్ధం చేసే ఉండి ఉంటుంది. దాని ప్రకారం మనం నడుచుకోవడమే. ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని నవ్వుతూ అధిగమించండి. బాధపడుతూ కూర్చుంటే మరింత కృంగిపోతాం.. సమస్యను పరిష్కరించే ఆలోచనలు కూడా దూరమవుతాయి అని రేణూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని రేణూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com