Renu Desai: ఆ హీరో పాన్ ఇండియా సినిమాతో రేణు దేశాయి రీఎంట్రీ..

Renu Desai (tv5news.in)
Renu Desai: ఒకప్పుడు తమ నటనతో అందరినీ మెప్పించిన హీరోయిన్లు మెల్లగా రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. తమ అందంతో, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఒకప్పటి భామలు కుదిరితే వెండితెరపై లేదా బుల్లితెరపై రీఎంట్రీకి సిద్ధమవుతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా త్వరలోనే కెమెరా ముందు తళుక్కుమంటుందన్న వార్త వైరల్‌గా మారింది.
ఇప్పటికే భూమిక, స్నేహలాంటి అలనాటి హీరోయిన్లు.. హీరోలకు అక్క పాత్రల్లో, వదిన పాత్రల్లో మెప్పించారు. అదే లిస్ట్‌లోకి రేణు దేశాయ్ కూడా జాయిన్ కానుంది. ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ పలు టీవీ షోల్లో కనిపించిన ఆమె.. త్వరలోనే వెండితెర రీఎంట్రీకి సిద్ధమవుతుందని టాక్ వినిపిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ పాన్ ఇండియా సినిమాలో రేణు కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం.
రవితేజ అప్‌కమింగ్ సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఒకప్పటి స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేవ్వరరావు బయోపిక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రాన్ని కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, మలయాళం, తమిళంలో కూడా గ్రాండ్‌గా విడుదల చేయాలని చూస్తోందట మూవీ టీమ్. అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరో అక్క పాత్రలో రేణు కనిపించనుందని టాక్. ఇదే నిజమయితే మరికొన్ని రోజుల్లో రేణు మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అవ్వడం ఖాయం అనుకుంటున్నారు ప్రేక్షకులు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com