Viswak Sen' Mechanic Rocky : మెకానిక్ రాకీకి రిపేర్లు..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొత్త సినిమా మెకానిక్ రాకీ. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. కొన్నాళ్లుగా చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ మూవీ. ఆ మధ్య విడుదల చేసిన గుళ్లెడు గుళ్లెడు మల్లేపూలు అనే పాటకు మంచి స్పందన కూడా వచ్చింది. సరిపోదా శనివారం మూవీలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టిన జేక్స్ బెజోయ్ సంగీతం చేస్తున్నాడు. ఇక షూటింగ్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తూనే పోస్ట్ ప్రొడక్షన్ కూడా సైమల్టేనియస్ గా కంప్లీట్ చేస్తున్నారు. దీంతో సినిమాను అక్టోబర్ 31న విడుదల చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. బట్ రావడం లేదు.
ఈ సినిమా అవుట్ పుట్ చూసుకున్న తర్వాత చాలా మార్పులు చేయాలనుకున్నారట. రిలీజ్ తర్వాత ఫ్లాప్ టాక్ ఫేస్ చేసే కంటే ముందే జాగ్రత్త పడి రీ షూట్ కు వెళ్లడం బెట్ అనుకున్నారు. అందుకే ప్రస్తుతం రీ షూట్ చేస్తున్నారట. ఈ కారణంగానే అక్టోబర్ 31న రావడం సాధ్యం కాదు అని ఫిక్స్ అయ్యారని సమాచారం. రీ షూట్ అయ్యాక మరోసారి చెక్ చేసుకుని అప్పుడు ఓకే అనుకుంటే నవంబర్ లో విడుదల చేద్దాం అనుకుంటున్నారట. నవంబర్ లో ఇప్పటి వరకూ పెద్ద సినిమాలేవీ అనౌన్స్ కాలేదు. దీంతో ఆ నెలలో ఏ వారంలో వచ్చినా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారట.
మొత్తంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హిట్ తర్వాత ఆ ట్రాక్ ను కంటిన్యూ చేయాలని బలంగా ఫిక్స్ అయ్యాడు విశ్వక్. అందుకే రీ షూట్ కూ వెనకాడటం లేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com