Returns of The Dragon : చరిత్ర సృష్టించిన డ్రాగన్ బాయ్స్

లవ్ టుడే సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ అయ్యాడు ప్రదీప్ రంగనాథన్. కుర్రాడిలో మంచి రైటింగ్ స్కిల్ ఉందని ఆ మూవీ చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది. తెలుగులోనూ లవ్ టుడే మంచి విజయం సాధించింది. తాజాగా డ్రాగన్ తో వచ్చాడు ప్రదీప్. తనలాగే ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్లుగా నటించారు. వీళ్లంతా క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏంటంటే.. ఈ చిన్న సినిమా ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది. అందులో ఆశ్చర్యం ఏముందీ అంటారా.. ఎందుకు ఉండదు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన కొత్త కుర్రాళ్లు కేవలం కంటెంట్ ను మాత్రమే నమ్మి చేసిన ప్రయత్నం ఇంత పెద్ద విజయం సాధించిందంటే ఖచ్చితంగా అభినందనీయం కదా. మరి ఆ రేంజ్ లో ఈ మూవీలో ఏముందీ అంటే..
డ్రాగన్ రిటర్న్స అనేది యుక్త వయసులో చేసిన తప్పులను మళ్లీ సరిదిద్దుకోలేం అని చెబుతుంది. తల్లితండ్రులను మోసం చేసినవాడు, ప్రేమ ఉంటే మాత్రమే చాలు అనుకుంటే కాదు.. సంపాదన కూడా ఉండాలని, జీవితంలో సక్సెస్ అవడం ఎంత ఇంపార్టెంటో ఈ తరానికి తెలియజేస్తుంది. అడ్డదారిలో అందలం ఎక్కాలనుకుంటే అందుకు ఇంకెన్ని తప్పులు చేయాలో కూడా చెబుతుంది. జీవితం ఒక అవకాశాన్ని మళ్లీ ఇచ్చిందంటే దానర్థం ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకోమంటుంది. నిజాయితీగా వేసే అడుగులే జీవితంలో అన్ని ఆనందాల్ని తెస్తాయంటుంది. మోసంతో కూడిన సంపాదన, ఆస్తులు ఎప్పటికైనా అవమానాల్నే తిరిగి ఇస్తాయంటుంది. ఇలాంటి ఎన్నో జీవిత అంశాలున్నాయి ఈ చిత్రంలో. కేవలం యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అనే చిన్నమాటతో కొట్టిపడేసే రచన కాదు ఈ చిత్రం.
దర్శకుడు రాసుకున్న ప్రతి సీన్ లోనూ ఓ లైఫ్ లెసన్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వినోదాత్మకంగా ఉన్నా.. హీరో అడ్డదారిలో అయినా గెలిచాడు కదా అని అక్కడితో ఆపేయకుండా.. అతని మనస్సాక్షిని తట్టి లేపడం.. మరొకరి అవకాశాన్నే అతను కొట్టేశాడు అనే గిల్టీ ఫీలింగ్ జీవితాంతం వెంటాడుతుందని తను తీసుకున్న నిర్ణయానికి ఫలితంగా చివరికి అతనికి మంచే జరగడం చూస్తాం. అందుకే ఈ మూవీ రివ్యూస్ కు అతీతంగా ఇంత పెద్ద విజయం సాధించింది. కొన్నిసార్లు కొన్ని రివ్యూస్ సాధారణంగా ఉంటాయి. కానీ సినిమా చూసే ప్రేక్షకులు ఇలాంటివి గమనిస్తే ఇంత పెద్ద విజయం వస్తుందని ప్రూవ్ చేసిన సినిమా ఇది. అందుకే ఓ చిన్న టీమ్ సాధించిన అతిపెద్ద విజయమే కాదు. కోలీవుడ్ కు ఇలాంటి టాలెంట్ ఎంత హై ఇస్తుందో కూడా చెప్పే మూమెంట్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com