ప్రామిసింగ్ కంటెంట్ తో వస్తోన్న ‘రేవు’

ప్రామిసింగ్ కంటెంట్ తో వస్తోన్న ‘రేవు’
X

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'రేవు'. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఆగస్ట్ 23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మీడియాతో ముచ్చటిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు మూవీ యూనిట్.

రేవు ప్రెస్ మీట్‌లో నిర్మాత మురళి గింజుపల్లి మాట్లాడుతూ.. పిలవగానే ఈ ఈవెంట్ కు వచ్చిన పాత్రికేయ కుటుంబానికి ధన్యవాదాలు. ఇప్పటికే ట్రైలర్, మూడు అద్భుతమైన పాటలు వచ్చాయి. ఇంకో పాట కూడా ఉంది. అది త్వరలోనే వస్తుంది. సినిమా రిలీజయ్యాక ఆ పాట చూసి మరింత ఎగ్జైట్ ఫీల్ అవుతారు అని అన్నారు.

హరినాథ్ పులి.. థ్యాంక్స్ టు తెలుగు మీడియా. ప్రతి ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని ఎలివేట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. సాంగ్స్, ట్రైలర్స్ లో ఎంత ప్రామిసింగ్ కంటెంట్ ఉందో సినిమాలో కూడా అంతే ప్రామిసింగ్ కంటెంట్ ఉంది. రేవు సినిమా ఆగస్టు 23న రిలీజ్ కానుంది. థియేటర్లో ఈ సినిమాని చూడండి అని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. నా పాత్రికేయ కుటుంబానికి స్వాగతం. రేవు సినిమాని ఆగస్టు 23న తీసుకురాబోతున్నాం. ఎప్పుడో సంవత్సరం క్రితం నేను ఒక అయిదు నిమిషాల ట్రైలర్ చూసాక ప్రేక్షకులకు నచ్చుతుంది ఈ సినిమా అనే కాన్ఫిడెన్స్ ఏర్పడింది. ఆ తర్వాత రాంబాబు గారు సినిమా చూసారు. మేమిద్దరం కలిసి మిత్రులు, NRI, నిర్మాత మురళి గారికి ఈ సినిమా చూపిస్తే వెంటనే ఈ సినిమాని నేను చేస్తాను, రిలీజ్ చేస్తాను అని చెప్పారు. అంతకుముందు డైరెక్టర్ హరినాథ్ పులి, మిగిలిన టీమ్ అంతా కలిసి డబ్బులు పోగేసుకొని ఈ సినిమాని ఒక దశకు తీసుకువచ్చాక మేము ఈ సినిమాలోకి వచ్చాము. నిర్మాణ పర్యవేక్షణ నేను చేస్తూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రాంబాబు చేస్తూ ఈ సినిమాని తీసుకొస్తున్నాము. ఈ సినిమాకి మంచి రెస్పాండ్ వస్తుంది. రేవు సినిమాకి మొదట ఒక కర్టెన్ రైజర్ ఈవెంట్ పెడితే ఆ సినిమాకు మురళీమోహన్ గారు, ఆర్జీవీ గారు రావడం, అది క్రేజీ ఈవెంట్ గా మారింది. ఆ తర్వాత ఇదే వేదికపై ఆడియో ఈవెంట్ చేసి అయిదుగురు అగ్రశ్రేణి గీత రచయితలను ఆహ్వానించి కొత్తగా చేసాము. ప్రతి ఈవెంట్ కు మంచి రెస్పాండ్ వస్తుంది. ఈ రెస్పాన్స్ చూస్తుంటే 23న సినిమా హిట్ అవుతుందని నమ్మకం కలుగుతుంది అని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ.. ఇక్కడున్న వాళ్లంతా నా పాత్రికేయ మిత్రులే. హరినాథ్ పులి చేసిన ఈ రేవు సినిమా, అతని టేకింగ్ చూసాక రాంబాబు గారితో మాట్లాడి మా ఫ్రెండ్స్ అయిన మురళి గింజుపల్లి, నవీన్ పారుపల్లి లకు చెప్పి ఈ సినిమాను ఈ స్టేజి వరకు తీసుకొచ్చాము. 23న సినిమా రిలీజ్ అయ్యాక అందరితో పర్సనల్ గా మాట్లాడతాను అని తెలిపారు.

Tags

Next Story