హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తంచేసిన వర్మ

హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తంచేసిన వర్మ

'మర్డర్' సినిమా విడుదల నిలిపివేయాలని నల్లగొండ కోర్టు ఇచ్చిన స్టేను హైకోర్టు కొట్టివేయడంపై ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హర్షం వ్యక్తంచేశాడు. మర్డర్ సినిమా తీయడం వెనుక ఉన్న మా ఉద్దేశాన్ని గౌరవనీయులైన న్యాయమూర్తి అర్థం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని ట్వీట్ చేశాడు. తీర్పునకు సంబంధించిన మొత్తం సమాచారం మా వద్దకు వచ్చిన తర్వాత సినిమా అప్ డేట్ ఇస్తాను. అందరికీ ధన్యవాదాలు అని' తెలిపాడు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా 'మర్డర్' సినిమా తీస్తున్నట్లు వర్మ ప్రకటించాడు. ఈ సినిమా ప్రకటన అనంతరం ప్రణయ్ కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ నల్లగొండ కోర్టును ఆశ్రయించారు. దీంతో సినిమా విడుదలపై కోర్టు స్టే విధించింది. కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తూ చిత్ర యూనిట్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు స్టే ఆర్డర్ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పుతో సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది.

Tags

Next Story