RGV Twitter: పవన్ కళ్యాణ్ సినిమాకు, సంపూర్ణేశ్ బాబు సినిమాకు తేడా లేదా: వర్మ

Perni Nani VS RGV (tv5news.in)

Perni Nani VS RGV (tv5news.in)

RGV Twitter: మంత్రి పేర్ని నాని ట్వీట్లకు కౌంటర్‌ ఇచ్చారు రామ్‌గోపాల్‌వర్మ.

RGV Twitter: మంత్రి పేర్ని నాని ట్వీట్లకు కౌంటర్‌ ఇచ్చారు రామ్‌గోపాల్‌వర్మ. టికెట్‌ ధర నిర్ణయించడానికి మధ్యలో ప్రభుత్వం ఎవరు అని మరోసారి సూటిగా ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్ సినిమాకి, సంపూర్ణేష్‌ బాబు సినిమాకి మీ ప్రభుత్వంలో తేడా లేనప్పుడు.. మంత్రిగా మీకు మీ డ్రైవర్‌కి కూడా తేడా లేదా అని సెటైర్‌ వేశారు. తమ నెత్తిన ఎక్కొద్దు అంటూ వర్మ చేసిన కామెంట్‌కు.. మంత్రి పేర్ని నాని కూడా ట్వీట్‌ చేశారు.

దీనికి వర్మ కూడా తన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. పేదలను ధనికుల్ని చేయడానికి మీ ప్రభుత్వం పనిచేయాలి గాని.. ఉన్న ధనికుల్ని పేదలుగా చేయకూడదు కదా అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్‌ వార్‌లో మంత్రి పేర్ని నాని సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాలను బట్టే థియేటర్లో టికెట్‌ రేట్లు నిర్ణయించాలని 1970 సినిమాటోగ్రఫీ యాక్ట్‌ చెబుతోందంటూ పేర్ని నాని ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌తో మీరు దొరికిపోయారంటూ పేర్ని నానికి వర్మ కౌంటర్‌ వేశారు. థియేటర్లో సౌకర్యాల ఆధారంగా టికెట్ రేట్లు ఉండాలన్నప్పుడు.. వి ఎపిక్‌ థియేటర్లోని సౌకర్యాలను చూడకుండా.. ఆ థియేటర్ ఉన్న ఏరియాను బట్టి టికెట్ రేటు ఎలా నిర్ణయించారంటూ సెటైర్ వేశారు. ఈ ముక్క మీకు అర్థమై ఉంటే ఇక సమస్య లేనట్టేనంటూ పేర్ని నానికి కౌంటర్ విసిరారు.

చివరిగా అంటూ.. మరో చురక అంటించారు వర్మ. వైసీపీలోని కొందరు నాయకుల్లా వ్యక్తిగత విషయాలను ప్రస్తావించో, అడ్డమైన తిట్లతోనో వెళ్లకుండా.. డిగ్నిటీతో సామరస్యంగా సమాధానాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ వర్మ ట్వీట్ చేశారు.


Tags

Next Story