RGV: తన స్టైల్‌లో మదర్స్ డే విషెస్ చెప్పిన ఆర్జీవీ.. మంచి కొడుకును కాదంటూ..

RGV: తన స్టైల్‌లో మదర్స్ డే విషెస్ చెప్పిన ఆర్జీవీ.. మంచి కొడుకును కాదంటూ..
RGV: మదర్స్ డే సందర్భంగా సెలబ్రిటీలంతా తమ అమ్మలతో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

RGV: మదర్స్ డే సందర్భంగా సెలబ్రిటీలంతా తమ అమ్మలతో ఫోటోలు దిగుతూ.. అమ్మ గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అలాగే రామ్ గోపాల్ వర్మ కూడా తన స్టైల్లో తల్లికి మదర్స్ డే విషెస్ తెలిపాడు. నలుగురికి నచ్చినది.. నాకసలే నచ్చదు అనుకునే వర్మ.. మదర్స్ డే విషెస్ కూడా వెరైటీగానే ఉన్నాయి.

రామ్ గోపాల్ వర్మ ఐడియాలజీనే వేరు. అందరూ ఒకలాగా ఆలోచిస్తే తాను మరోలా ఆలోచిస్తుంటారు. అందుకే చాలామందిలాగా తను స్పెషల్ సందర్భాలను సెలబ్రేట్ చేసుకోడు. అలాంటి మదర్స్ డే రోజు స్పెషల్‌గా తన తల్లితో దిగిన ఫోటో షేర్ చేయడంతో పాటు ఓ వెరైటీ క్యాప్షన్ కూడా పెట్టాడు.

'హ్యపీ మదర్స్ డే అమ్మ. నేను మంచి కొడుకును కాదేమో కానీ నువ్వు మాత్రం మంచి అమ్మవి' అని క్యాప్షన్‌తో తన తల్లితో దిగిన ఫోటోను షేర్ చేశాడు ఆర్జీవీ. ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అయిపోయి తెగ లైకులు కొట్టేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story