RGV's Saaree : రామ్ గోపాల్ వర్మ శారీ మూవీ ట్రైలర్ ఎలా ఉంది..?

రామ్ గోపాల్ వర్మపై ఎవరికెన్ని కంప్లైంట్స్ ఉన్నా.. అతనిలోని ఒకప్పటి ఫిల్మ్ మేకర్ పై ఎవరికీ అనుమానాలు లేవు. ఎటొచ్చీ ఆ ప్రతిభావంతమైన ఆర్ట్ ఫామ్ ను కొన్నాళ్లుగా చూపించడం లేదు అనేదే అందరి కోపం. దీనికి తోడు అన్ని విషయాల్లో వేలు పెట్టి కాంట్రవర్శీలు క్రియేట్ చేయడంతో వ్యక్తిగతం కూడా అతని ఇమేజ్ డ్యామేజ్ అయింది. అయితే తను తప్పు తెలుసుకున్నానని.. ఇకపై పాత రామ్ గోపాల్ వర్మను చూస్తారని అన్నాడు. కానీ అతని మాటలను నమ్మడం కష్టమే. బట్ లేటెస్ట్ గా అతనెప్పుడో సోషల్ మీడియాలో చూసి మనసు పడిన శారీ బ్యూటీతో ఏకంగా సినిమా చేశాడు. ఆ టైటిల్ కూడా ‘శారీ’ అనే పెట్టాడు. తాజాగా ఈ శారీ మూవీ ట్రైలర్ విడుదలైంది.
ఫోటోగ్రాఫర్ అయిన ఓ శాడిస్ట్ శారీలో ఉన్న అమ్మాయిని చూసి మోహిస్తాడు. ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లి ఆమెకు తెలియకుండానే ఫోటోస్ తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. మెల్లగా ఆమెతో స్నేహం పెంచుకుంటాడు. అతని దురుద్దేశం తెలియని ఆమె తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా.. ఇతనితో స్నేహం చేస్తుంది. ఒకానొక దశలో అతను సైకో అని తెలుస్తుంది. అతని బారిన పడుతుంది. దీని వల్ల ఆ అమ్మాయి ఏం కోల్పోయింది..? అనే కోణంలో కనిపిస్తోందీ ట్రైలర్.
మేకింగ్ పరంగా చూస్తే బావుంది. ఎక్కువ పాత్రలు, లొకేషన్స్ లేకుండానే నీట్ గా రూపొందించినట్టు కనిపిస్తోంది. అయితే ఈ చిత్రానికి వర్మ దర్శకుడు కాదు. రచయిత, ప్రెజెంటర్ మాత్రమే. దర్శకత్వం చేసింది గిరి కృష్ణ కమల్ అనే అతను. శారీ గాళ్ గా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఆరాధ్య దేవితో పాటు సత్య యాదు, సాహిల్ సంభ్యాల్, అప్పాజీ అంబరీష్, కల్పలత కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్ చూసి ఆర్జీవీ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. మరి అది నిజమా కాదా అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. అన్నట్టు ఈ చిత్రాన్ని ఈ నెల 28న ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాడు ఆర్జీవి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com