Rhea Chakraborthy : మోటివేషనల్ స్పీకర్ గా రియా

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత వివాదాస్పద హీరోయిన్లలో రియా చక్రవర్తి ఒకరు. ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆఫర్లు సైతం వెక్కిరించాయి. మరోవైపు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపించడంతో సినీ పరిశ్రమ ఈ బ్యూటీని దూరం పెట్టింది. దాదాపు నెల రోజులపాటు రియా జైల్లోనే గడిపింది. అయితే సుశాంత్ సింగ్ చనిపోయిన తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్లయ్యిందో రియా వివరించారు. 'ప్రస్తుతం నేను ఏం చేస్తున్న.. నా జీవనాధారం ఏమిటి? అని పలువురు అడుగుతున్నరు. కొంతకాలంగా సినిమాల్లో నటించడం లేదు. మోటివేషనల్ స్పీకర్గా మారా. తద్వారా డబ్బులు సంపాదిస్తున్న. ఇది నా జీవితంలో ఛాప్టర్ 2 అనే చెప్పాలి. గతంలో నేను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న. ఎందరో విమర్శించారు. కొంతమంది నేను చేతబడి చేశానన్నారు. నేను అనుభవించిన బాధ నాకు మాత్రమే తెలుసు. ఎదుటివాళ్లకు నచ్చినా నచ్చకపోయినా నాకు నేను నిజాయితీగా ఉన్నాను. ధైర్యంగా ముందుకు వెళ్తున్న' అని రియా చక్రవర్తి తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com