సినిమా

Rhea Chakraborty: రియా చక్రవర్తి తమ్ముడి ఎమోషనల్ పోస్ట్.. ఏడాది గడిచిపోయింది అంటూ..

Rhea Chakraborty: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఈ యంగ్ హీరో మన మధ్య లేక ఏడాదిపైనే అవుతోంది.

Rhea Chakraborty: రియా చక్రవర్తి తమ్ముడి ఎమోషనల్ పోస్ట్.. ఏడాది గడిచిపోయింది అంటూ..
X

Rhea Chakraborty: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఈ యంగ్ హీరో మన మధ్య లేక ఏడాదిపైనే అవుతోంది. కానీ తన మరణం గురించి ఇంకా తన ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. అంతే కాకుండా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో అలాంటి ఓ యంగ్ హీరో ఆత్మహత్య చేసుకోవడమేంటి..? అని కొందరు. ఇది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ మరికొందరు ఇప్పటికీ సోషల్ మీడియాలో పోరాడుతూనే ఉన్నారు. తాజాగా ఈ విషయంపై పరోక్షంగా స్పందించాడు రియా చక్రవర్తి తమ్ముడు షౌవిక్ చక్రవర్తి.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయే సమయానికి తాను బాలీవుడ్ భామ రియా చక్రవర్తితో రిలేషన్‌లో ఉన్నాడు. అందుకే తన ఆత్మహత్యకు, రియాకు ఏదైనా సంబంధం ఉందేమో అని అభిమానులు అనుమానించారు. దీని గురించి దర్యాప్తు చేయాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దర్యాప్తు సమయంలో అనేక నిజాలు బయటపడ్డాయి. రియాకు డ్రగ్స్ అలవాటు ఉందని, తనకు డ్రగ్ డీలర్స్‌తో సంబంధం ఉందని తేలింది. దీంతో ఆత్మహత్య కేసు కాస్త డ్రగ్స్ కేసులాగా మారిపోయింది.

రియా మాత్రమే కాదు తన తమ్ముడు షౌవిక్ కూడా ఈ కేసులో ఫిర్యాదును ఎదుర్కున్నాడు. ఇద్దరు కొన్నాళ్లు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఇప్పుడిప్పుడే రియా బయటికి వస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం మొదలుపెట్టింది. ఇది చూసి ధైర్యం తెచ్చుకున్న తన తమ్ముడి షౌవిక్ కూడా గత సంవత్సర కాలంగా తన జీవితం ఎలా గడిచిందో చెప్తూ ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు.

'ఒక సంవత్సరం గడిచిపోయింది.. నేను 24 ఏళ్ల జీవితంలో నేర్చుకోలేనిది.. ఈ సంవత్సర కాలంలో నేర్చుకున్నాను. నేను ఇలా మారడానికి ఈ సంవత్సరమే కారణం. నేను మళ్లీ ఇంట్లో నా కుటుంబంతో, స్నేహితులతో ఉండడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ కష్ట సమయంలో నా కుటుంబానికి అండగా ఉన్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు షౌవిక్ చక్రవర్తి. దీనికి రియా 'గాడ్ బ్లెస్ యూ మై వారియర్' అని రిప్లే కూడా ఇచ్చింది.


Next Story

RELATED STORIES