Rishab Shetty : జాతీయ అవార్డుపై రిషబ్ శెట్టి కీలక నిర్ణయం

Rishab Shetty : జాతీయ అవార్డుపై రిషబ్ శెట్టి కీలక నిర్ణయం
X

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు వచ్చిన జాతీయ అవార్డును రాష్ట్రంలోని దేవ నర్తకులకి, దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్‌కి, కన్నడ ఆడియన్స్‌కి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ అవార్డు గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. హొంబలే ఫిల్మ్స్ ‘కాంతార’ను నిర్మించగా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

సెప్టెంబర్ 30న కర్ణాటక రాష్ట్రంలో 250 థియేటర్లలో విడుదలై కాంతారా మూవీ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ఆ తర్వాత ఇతర భాషల్లో కాంతారా మూవీ డబ్ అయ్యి ఇతర భాషల్లో సైతం హిట్ గా నిలిచింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది అంటే ఈ సినిమా ప్రేక్షకులకు ఏ స్థాయిలో నచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులకు బాగా నచ్చింది. కేంద్రం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించగా ఉత్తమ నటుడి పురస్కారం కాంతారా సినిమాకు గాను రిషబ్ శెట్టికి దక్కింది. రిషబ్ శెట్టికి జాతీయ అవార్డు దక్కడం సినీ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.

Tags

Next Story