Rishab Shetty : ఒక హెయిర్ స్టైల్.. మూడు సినిమాలు

ఒకే హెయిర్ స్టైల్ తో మూడు సినిమాలు చేయడం చాలా చాలా రేర్ గా కనిపిస్తుంది. పైగా ఈ మూడు సినిమాలకూ అదే హెయిర్ స్టైల్ అవసరం అనే సందర్భాలు ఇంకా అరుదు. అలాంటి అరుదైన ఫీట్ నే సాధించాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. కాంతారతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన రిషబ్.. ప్రస్తుతం కాంతారకు ప్రీక్వెల్ చేస్తున్నాడు. వీటి దర్శకుడుగా కూడా అద్భుతమైన అప్లాజ్ అందుకున్నాడు రిషబ్. కాంతార ఇచ్చిన బూస్టప్ తో అన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడిప్పుడు.
కాంతార ప్రీక్వెల్ మరోసారి దేశం మొత్తాన్ని ఊపేయడం ఖాయం అంటున్నారు. వచ్చే వేసవిలో విడుదల కాబోతోందీ చిత్రం. దీంతో పాటు తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ తో జై హను మాన్ చేస్తున్నాడు. ఈ మూవీలో ఆయన హను మాన్ పాత్రనే చేస్తున్నాడు. హను మాన్ మూవీతో ప్యాన్ ఇండియా హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు రిషబ్ ఖచ్చితంగా బిగ్గెస్ట్ ఎసెట్ అవుతాడు అని చెప్పొచ్చు.
ఇక లేటెస్ట్ గా మరో క్రేజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. ‘ఛత్రపతి శివాజీ మహరాజ్’.. ఈ మూవీ టైటిల్. సో.. ఛత్రపతి శివాజీ పాత్రలో రిషబ్ కనిపించబోతున్నాడు. శివాజీ అంటే మాస్ అప్పీల్ ఉన్న రాజుగా అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా శివాజీ పేరిట రాజకీయాలు కూడా ఉన్నాయి. ఆయన కథతో సినిమా అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనుకోవచ్చు. పైగా ఇప్పటి వరకూ శివాజీ కథను సరిగ్గా తెరకెక్కించిన వాళ్లు లేరు. కాకపోతే.. హిందూ పూజారుల చేత అవమానించబడిన శివాజీ కథను చాలామంది వక్రీకరిస్తున్నారీ మధ్య. ఈ పోస్టర్ చూస్తే ఆ వక్రీకరణలో భాగంగానే కనిపిస్తోందనే కమెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఆ కామెంట్స్ కు ప్రిపేర్ అయ్యే ఈ పోస్టర్ విడుదల చేశాం అని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు మేకర్స్. సందీప్ సింగ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని 2027 జనవరి 1న విడుదల చేస్తాం అని కూడా ప్రకటించారు.
ఇక విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాలకూ ఒకే హెయిర్ స్టైల్ తో కనిపిస్తున్నాడు రిషబ్. ఒత్తుగా పెరిగిన జుత్తు, గడ్డం ఉంటుంది. అది ఆ పాత్రలకు తగ్గట్టుగా మార్చేస్తున్నారు. నిజానికి ఇదో అదృష్టం అనే చెప్పాలి. వేరే కథ అయి అందులో ఇలాంటి హెయిర్ స్టైల్ లేకపోతే.. ఇది పూర్తయ్యే వరకూ అది చేయడం సాధ్యం కాదు. ఏదేమైనా కాంతార ఇచ్చిన బూస్టప్ తో కన్నడ సీమ నుంచి మరో ప్యాన్ ఇండియన్ స్టార్ రెడీ అవుతున్నాడు అనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com