Rishabh Shetty with NTR : ఎన్టీఆర్ తో రిషభ్ శెట్టి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర విడుదలకు టైమ్ దగ్గర పడుతోంది. మరవైపు ఆయన చేతికి అయిన గాయం ఇంకా తగ్గలేదు అని చెబుతున్నారు. అలాగే ఈ వారంలోనే దేవర మూవీకి అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పబోతున్నాడు ఎన్టీఆర్. అది ఎంతో పెద్ద టాస్క్ అని వేరే చెప్పక్కర్లేదు. చేతి గాయం కారణంగా ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు అని చెప్పారు. బట్ చూస్తుంటే ఆ గాయంతోనే అతను మంగుళూరు వెళ్లినట్టు కనిపిస్తోంది. తాజాగా ఎన్టీఆర్ మంగుళూరు ఎయిర్ పోర్ట్ లో కాంతార ఫేమ్ రిషభ్ శెట్టితో కలిసి కనిపించాడు. అంటే వీళ్లు ఫ్లైట్ లో క్యాజువల్ గా కలిశారా లేక ఇద్దరూ కలిసే వెళ్లారా అనేది తెలియాల్సి ఉంది. బట్ ఇద్దరు టాలెంటెడ్ పీపుల్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం మాత్రం సౌత్ లోని వారి ఫ్యాన్స్ కు చూడ ముచ్చటగా అనిపించింది. అన్నట్టు ఎన్టీఆర్ అమ్మమ్మ వాళ్ల ఊరు మంగుళూరు దగ్గరలోని కుందాపుర. రిషభ్ శెట్టిది కూడా అదే ఊరు. ఆ రకంగానే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ఇక రిషభ్ అయితే ఎన్టీఆర్ కు వీరాభిమాని.
ఇక రిషభ్ కు కాంతార మూవీకి ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డ్ వచ్చింది. ప్రస్తుతం కాంతారకు ప్రీక్వెల్ తీస్తున్నాడు రిషభ్. ఈ మూవీతో మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు. ఆ మధ్య విడుదల చేసిన గ్లింప్స్ చూస్తే అది గ్యారెంటీ అనిపిస్తోంది కూడా. మొత్తంగా ఎన్టీఆర్ రిషభ్ శెట్టి కలయిక క్యాజువల్ గా జరిగిందా.. లేక ఈ మీటింగ్ వెనక ఇంకేదైనా ఎజెండా ఉందా అనేది తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com