Marathi film Ved: సామ్, చై హిట్ మూవీ.. అక్కడ కూడా బ్లాక్ బస్టరే..

Marathi film Ved: సామ్, చై హిట్ మూవీ.. అక్కడ కూడా బ్లాక్ బస్టరే..
Marathi film Ved: నిజ జీవితంలో భార్యా భర్తలు.. రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా నటించిన తాజా మరాఠీ చిత్రం 'వేద్' ప్రేక్షకుల ప్రశంసలందుకుంటోంది..

Marathi film Ved: నిజ జీవితంలో భార్యా భర్తలు.. రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా నటించిన తాజా మరాఠీ చిత్రం 'వేద్' ప్రేక్షకుల ప్రశంసలందుకుంటోంది.. బాక్సాఫీస్ కలెక్షన్లను తిరగరాస్తోంది. నటుడు రితేష్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. వేద్ తెలుగు సినిమా మజిలీకి రీమేక్. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకారం, వేద్ విడుదలైన మొదటి వారంలో రూ. 20 కోట్లకు పైగా వసూలు చేసింది.




సినిమా విడుదలకు ముందు రితేష్ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేస్తూ, "20 ఏళ్ల పాటు కెమెరా ముందు ఉన్న నేను, మొదటిసారిగా దాని వెనుక నిలబడటానికి పెద్ద యుద్ధమే చేస్తున్నాను.. ఇది నేను నా మొదటి మరాఠీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నందున మీ అందరు శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదాలను అందించాలని వినమ్రంగా అడుగుతున్నాను. ఈ ప్రయాణంలో మీరూ భాగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక రితేష్ భార్య జెనీలియా కూడా మంచి నటిగా ఇప్పటికే పేరు తెచ్చుకుంది. పెళ్లి, పిల్లలతో గత పదేళ్ల నుంచి నటనకు దూరమైంది. ఇప్పుడు వేద్‌లో ఆమె హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మెప్పు పొదుతోంది. ఇది ఆమెకు తొలి మరాఠీ చిత్రం కావడం విశేషం.



కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ విడుదలైన 15 రోజుల్లో రూ.44.92 కోట్లు రాబట్టింది. మరాఠా బ్లాక్ బస్టర్ సైరాట్ (రూ.110 కోట్లు) తర్వాత ఆ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా వేద్ నిలిచింది. సినిమా సక్సెను ఎంజాయ్ చేస్తున్న జెనీలియా..పదేళ్ల విరామంలో ఎన్నో పనులు చేయడానికి అవకాశం లభించింది. ఇప్పటి వరకు ఏదీ ప్లాన్ చేసుకుని వెళ్లలేదు. ఇందులో కూడా నాది ఓ గృహిణి పాత్ర. అందుకే సహజంగా వచ్చిందేమో. ఒకవేళ రితేశ్ లేకపోతే ఆ పాత్ర చేయడానికి మరింత సమయం పట్టేది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేయడానికి ఇదే సరైన సమయం అని రితేశ్ నన్ను ప్రోత్సహించాడు అని జెనీలియా తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story