Rithu Chowdary : 'ఆది బ్రో.. రీతూని నీ స్కిట్‌‌లో కంటిన్యూ చేయి' .. ఆమెకి ఎందుకంత డిమాండ్?

Rithu Chowdary :  ఆది బ్రో..  రీతూని నీ స్కిట్‌‌లో కంటిన్యూ చేయి .. ఆమెకి ఎందుకంత డిమాండ్?
Rithu Chowdary : ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది జబర్దస్త్ కామెడీ షో.. ఎనమిదేళ్ళ కిందట మొదలైన ఈ షోకి ఎక్కడ కూడా క్రేజ్ తగ్గడం లేదు.

Rithu Chowdary : ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది జబర్దస్త్ కామెడీ షో.. ఎనమిదేళ్ళ కిందట మొదలైన ఈ షోకి ఎక్కడ కూడా క్రేజ్ తగ్గడం లేదు. టాప్ టీఆర్పీతో దూసుకుపోతుంది. అయితే జబర్దస్త్‌‌లో ఒకప్పుడు ఆర్టిస్టులంతా మగవాళ్ళే ఉండేవారు.. లేడి గెటప్‌‌లు కూడా వారే.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. లేడి కమెడియన్లు ఒక్కొక్కరిగా వస్తున్నారు.. రాణిస్తున్నారు.

ఇందులో మొదటగా వచ్చి ఫేం సంపాదించుకుంది సత్యశ్రీ.. ఆ తర్వాత రోహిణి, వర్ష వచ్చారు.. మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. ఇప్పుడా ఈ లిస్టులో చేరిపోయింది రీతూ చౌదరి. హైపర్ ఆది స్కిట్‌‌ లలో వరుసగా చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. ఇప్పుడు ఈమెకి సెపరేట్ గా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తాజాగా చేసిన ఓ స్కిట్ లో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో ఆకట్టుకుంది.

దీనితో "ఆది బ్రో...రీతూని నీ స్కిట్‌‌లో కంటిన్యూ చేయి.. ఆమె చేయడం వల్ల నీ స్కిట్‌‌ కో అందం వచ్చింది" అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలావుండగా గోరింటాకు సీరియల్‌లో నెగిటివ్ రోల్ పోషించి నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది రీతూ.. యాంకర్ ప్రదీప్ పాపులర్ షో 'పెళ్లి చూపులు'లో కూడా పార్టిసిపేట్ చేసింది కూడా.. ఇప్పుడు జబర్దస్త్ లో చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story