Robinhood OTT Date : ఓటిటిలోకి రాబిన్ హుడ్.. ఎప్పుడంటే

Robinhood OTT Date :  ఓటిటిలోకి రాబిన్ హుడ్.. ఎప్పుడంటే
X

నితిన్, శ్రీ లీల జంటగా నటించిన సినిమా రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీపై నితిన్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మధ్య క్రింజ్ కామెడీ బాగా వర్కవుట్ కాబట్టి తన మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందనుకున్నాడు. బట్ తను ఏదైతే ప్లస్ అవుతుందనుకున్నాడో కరెక్ట్ గా అదే మైనస్ అయింది. సినిమా డిజాస్టర్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈచిత్రాన్ని గతేడాది డిసెంబర్ నుంచి పోస్ట్ పోన్ చేస్తూ వచ్చి మార్చి 28న విడుదల చేశారు. లేట్ అయినా లేటెస్ట్ గా హిట్ అవుతుందనుకున్నారు. బట్ అవలేదు. ఈ మూవీతో నితిన్ ఖాతాలో మరో డిజాస్టర్ పడిపోయింది.

నిజానికి నితిన్ ఈ మూవీపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అందుకే ఎప్పుడూ లేనంతగా ప్రమోషన్స్ చేశాడు. కానీ ‘విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్స్ పీక్స్ లో’ ఉంటాయి అన్న సినిమా సామెత ఈ చిత్రానికి సరిగ్గా సరిపోయింది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ లాంటి వాళ్లు ఉన్నా.. కామెడీ పండించలేకపోయారు అంటే ఆ తప్పు దర్శకుడిది.. రచనది. మొత్తంగా మార్చి 28న విడుదలైన ఈ మూవీ ఓటిటిలోకి రాబోతోంది. మే 2 నుంచి జీ 5లో స్ట్రీమ్ కాబోతోంది. అయితే ఈ డేట్ ను మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.

Tags

Next Story