Rocketry: The Nambi Effect : ఓటీటీలోకి మాధవన్ నటించిన 'రాకెట్రీ'.. ఎప్పుడంటే..

Rocketry: The Nambi Effect : నటుడు మాధవన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్ థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో మాధవన్ నంబి నారాయణన్ పాత్ర పోషించారు. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.40 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది.
ఇప్పటి వరకు థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ,మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. రితా మాధవన్, వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సిమ్రాన్, రవి రాఘవేంద్ర, మిషా ఘోషాల్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com