Jabardasth Rocking Rakesh: కామెడీషోలో మరో లవ్ ట్రాక్.. పెళ్లికి వేళాయే..

Jabardasth Rocking Rakesh: వరుసగా రెండు మూడు సినిమాల్లో హీరో హీరోయిన్లు కలిసి నటిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటారు ఆడియన్స్. బుల్లితెర షోలు కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు.. కామెడీ షోలు, కలిసి యాంకరింగులు.. ఏదైతేనేం తెరమీద వాళ్లిద్దరు కెమిస్ట్రీ బాగా పండిస్తారు..
ఒకే ఫీల్డ్.. కష్టసుఖాలు కలిసి పంచుకోవచ్చు అనుకున్నారేమో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత పెళ్లితో ఒక్కటవుదామనుకుంటున్నారు. ఈ జబర్థస్త్ ఆర్టిస్టులు కలిసి స్కిట్లు చేస్తుంటారు.. సుజాత అంతకు ముందు ఓ ఛానెల్లో యాంకర్‌గా పని చేసినా ఇప్పుడు జబర్థస్త్ టీమ్‌లో భాగమైంది. రాకేష్ స్కిట్స్‌లో అతడికి జోడీగా నటిస్తూ నవ్వులు పంచుతోంది..
ఇప్పటికే సుధీర్-రష్మీల జోడీ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. కొన్నేళ్లుగా ఇద్దరూ కలిసి నటిస్తున్నా ఆడియన్స్‌కి బోరు కొట్టని జంట అంటే వారిద్దరి పేరే వినిపిస్తుంది. ఇక మరో జంట ఆది-వర్షిణీలు.. వీళ్లిద్దరు కూడా స్క్రీన్ మీద లవ్ ట్రాక్ నడిపిస్తుంటారు.
అయితే రాకేష్-సుజాతల జోడీ బావుంటుందని వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని మరో ఆర్టిస్ట్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు. వాళ్లిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. స్టేజ్‌పైన కూడా శ్రద్ధ చూపించుకుంటారు.. ఇద్దరు కలిసి జీవితం పంచుకుంటే బావుంటుంది అని బాబు తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే వీళ్లిద్దరూ ఈ ఏడాదే పెళ్లిపీటలు ఎక్కనున్నారని అన్నాడు. అయితే ఈ విషయంపై రాకేష్, సుజాత స్పందించవలసి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com