Rocking Star Yash : టాక్సిక్ గ్లింప్స్ లో ఏముంది..

Rocking Star Yash :  టాక్సిక్ గ్లింప్స్ లో ఏముంది..
X

కేజీఎఫ్ స్టార్ యశ్ నెక్ట్స్ మూవీ టాక్సిక్. గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ కోసం యశ్ చాలాకాలం వెయిట్ చేశాడు. నిజానికి కేజీఎఫ్ రెండు భాగాల తర్వాత అతనికి దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ను సస్టెయిన్ చేస్తూ స్ట్రాంగ్ కంటెంట్ తో రావడానికి భయపడ్డాడు అనే టాక్స్ కూడా వచ్చాయి. ఫైనల్ గా అతనికి నచ్చిన కథగా ‘టాక్సిక్’ వచ్చింది. ఏ ఫెయిరీ టేల్ ఫర్ క్రోన్ అప్స్ అనే క్యాప్షన్ తో రూపొందుతున్న ఈ మూవీ నుంచి తాజాగా టాక్సిక్ బర్త్ డే పీక్ అంటూ ఓ గ్లింప్స్ విడుదల చేశారు. యస్.. ఇవాళ యశ్ బర్త్ డే సందర్భంగానే ఈ గ్లింప్స్ వచ్చింది. అయితే ఇందులో ఏముందీ అంటూ చాలామంది అర్థం కాక కామెంట్స్ చేస్తున్నారు.

గ్లింప్స్ లో కొత్తగా అప్డేటేం లేదు అని చాలామంది భావిస్తున్నారు. కానీ తరచి చూస్తే.. అతను పారడిసో అనే ప్లేస్ కు వెళ్తాడు హీరో. ఆప్రాంతం అంతా మనీ, మత్తు, మగువ, విచ్చలవిడి తనం, విశృంఖలత్వం విపరీతంగా ఉన్న ఆ ప్రాంతానికి వెళ్లిన హీరో అక్కడేం చేస్తాడు..? అతను అక్కడికి వెళ్లడం వెనక ఉద్దేశ్యం ఏంటీ..? ఏదైనా ఆపరేషన్ లో భాగంగా వెళ్లాడా.. లేక శతృవులున వెదుక్కుంటూ వెళ్లాడా అనే పాయింట్ సినిమాలో కనిపిస్తుంది. బర్త్ డే కాబట్టి చిన్న పీక్ వదిలారు. అందుకే ఇది చాలామంది ‘సరిగ్గా’అర్థం కావడం లేదేమో.

మొత్తంగా గీతూ మోహన్ దాస్ టేకింగ్ స్టైలిష్ గా ఉంది. యశ్ లుక్ కేజీఎఫ్ కు కొనసాగింపులానే ఉంది. గెటప్ పరంగా చూస్తే అది ఈ సీన్ వరకే పరిమితం అనేలా ఉంది. కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ తో కలిసి తను కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు యశ్. అయితే ఈ మూవీలో నటించే ఫీమేల్ లీడ్ కు సంబంధించిన క్లారిటీ మాత్రం ఇప్పటి వరకూ రాలేదు.

Tags

Next Story