Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ బ్రేకప్.. స్పందించిన బాయ్‌ఫ్రెండ్..

Shraddha Kapoor (tv5news.in)
Shraddha Kapoor: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ తన ప్రియుడు రోహన్ శ్రేష్ఠతో విడిపోయిందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన రోహన్ శ్రేష్ఠతో గత నాలుగేళ్ళుగా డేటింగ్‌లో ఉన్న శ్రద్ధాకపూర్ ఇప్పుడు అతనికి బ్రేకప్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇటీవల గోవాలో జరిగిన శ్రద్ధా బర్త్ డే పార్టీలో రోహన్ ఎక్కడ కనిపించలేదు. దీనితో వీరిద్దరూ విడిపోయారన్న వార్తలకి బలం చేకూరుతోంది. తాజాగా రోహన్ ఈ రూమర్స్‌పై స్పందించాడు.
నాలుగేళ్లుగా డేటింగ్‌లో ఉన్నా కూడా శ్రద్ధా కపూర్, రోహన్ ఎప్పుడూ వారి రిలేషన్‌షిప్ గురించి బయటపెట్టలేదు. అయినా వీరి సాన్నిహిత్యం చూసి బాలీవుడ్‌లో కథనాలు మొదలయ్యాయి. అయితే ప్రేమ మాత్రమే కాదని వీరిద్దరు పెళ్లి కూడా చేసుకునేంత సీరియస్‌గా ఉన్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. కొన్నాళ్ల క్రితం ఈ విషయంపై శ్రద్ధా కపూర్ తండ్రి స్పందిస్తూ.. అలాంటిది ఏమీ లేదని, ముందు శ్రద్ధ తన కెరీర్‌లో సెటిల్ అవ్వాలనుకుంటుందని తెలిపాడు.
అయితే కొన్ని గంటలుగా రోహన్, శ్రద్ధా కపూర్ విడిపోయారన్న విషయం బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. రోహన్ వీటిపై స్పందించాడు. నిజంగానే శ్రద్ధాతో బ్రేకప్ అయ్యిందా అని ఓ నేషనల్ మీడియా సంస్థ రోహన్‌ను అడగగా తానెప్పుడూ తన పర్సనల్ లైఫ్ గురించి బయటపెట్టలేదు. ఇప్పుడు కూడా పెట్టను అని స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com