Roja: 'నాకు ఇష్టమైనది వదులుకుంటున్నాను'.. స్టేజ్‌పై రోజా కంటతడి..

Roja: జబర్దస్త్ అనే ఒక్క స్టాండప్ కామెడీ షో చాలామంది జీవితాలను మార్చేసింది. యాంకర్ల దగ్గర నుండి కమెడియన్ల వరకూ అందరూ చాలా ఫేమస్ అవ్వడానికి ఈ ఒక్క షోనే ప్రధాన కారణంగా మారింది. అలాగే వారితో పాటు మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది రోజా. రోజా ఈ షోలో అడుగుపెట్టిన తర్వాతే ఎమ్మెల్యేగా మారింది. ఇప్పుడు మంత్రి కూడా అయ్యింది. దాని గురించి మాట్లాడుతూ స్టేజ్‌పైనే ఎమోషనల్ అయ్యింది రోజా.
అలనాటి నటి రోజా.. ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అందరి హీరోయిన్లలాగానే కొంతకాలానికి తన కెరీర్ కూడా స్లో డౌన్ అయ్యింది. అయినా సినిమాలకు దూరంగా ఉండకుండా తన నటనను కొనసాగిస్తూనే ఉంది. అలాంటి సమయంలోనే రోజాకు జబర్దస్త్‌లో జడ్జిగా అవకాశం వచ్చింది. అక్కడ నుండి తన లైఫ్ టర్న్ అయిపోయింది.
జబర్దస్త్ షో చాలా సక్సెస్ అవ్వడంతో రోజా జీవితం కూడా చాలా మారింది. రాజీకయ నాయకురాలు అవ్వాలనే తన కల జబర్దస్త్‌కు వచ్చిన తర్వాతే నెరవేరింది. తాజాగా మంత్రి పదవిని కూడా చేపట్టింది. దీంతో జబర్దస్త్‌ను వదిలి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది. అందుకే తనకు నచ్చిన ఒకదాని కోసం మరొకటి వదిలేయాల్సి వస్తుంది అని జబర్దస్త్ స్టేజ్‌పై కంటతడి పెట్టింది రోజా. అంతే కాకుండా అందరినీ మిస్ అవుతాను అంటూ ఎమోషనల్ అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com