Roshan Kanakala : యాంకర్ సుమ కొడుకు హీరోగా మరో సినిమా
యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా బబుల్ గమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ పెద్దగా ఆడకపోయినా కుర్రాడు ఆకట్టుకున్నాడు. అయితే స్టార్ హీరోల వారసులే ఇండస్ట్రీలో నిలబడటానికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది సుమ కొడుకు నిలుస్తాడా అనుకున్నారు. అయితే అతను ఆల్రెడీ మరో మూవీతో రెడీ అవుతున్నాడు. ‘మౌగ్లీ’ 2025 అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సందీప్ రాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
సందీప్ రాజ్ ఇంతకు ముందు కలర్ ఫోటో అనే మూవీతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి జాతీయ అవార్డ్ సైతం వచ్చింది. ఆ తర్వాత అతను చేస్తోన్న మూవీ ఇదే. ఈ మౌగ్లీ అంటే అందరికీ తెలుసు. జంగిల్ బుక్ స్టోరీలో కుర్రాడు ఆకట్టుకునే పాత్ర ఇది. అలాంటి క్యారెక్టర్ నేమ్ తో సోషల్ డ్రామాగా సందీప్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడేమో అనిపిస్తోంది.
ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. రోషన్ ఓగుర్రాన్ని పట్టుకుని వెళుతున్నట్టుగా ఉందీ పోస్టర్. ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తోనే వస్తున్నట్టు అర్థం అవుతోంది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ మూవీని 2025 సమ్మర్ లో విడుదల చేస్తాం అని పోస్టర్లో ఉంది. హీరోయిన్ తో పాటు ఇతర కాస్టింగ్ కు సంబంధించిన వివరాలు ఇంకా రావాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com