Roshan : ఛాంపియన్ కోసం రోషన్ నాలుగేళ్ళ నిరీక్షణ.. అంత నమ్మకమా ?

శ్రీకాంత్ తనయుడు రోషన్ రోషన్‌కు తొలి సినిమా పెళ్లి సందడి ఆశించిన స్థాయిలో బ్రేక్ ఇవ్వలేకపోయింది. చాలామంది ఆ దశలో వెంటనే మరో సినిమా చేసేవాళ్లు. కానీ రోషన్ అలా చేయలేదు. తాను ఏం చేయగలడో, తనకు సరైన లాంచ్ ఏదో తెలుసుకున్నాడు. అందుకే నాలుగేళ్లు వెయిట్ చేశాడు. ఒక సినిమాకోసం… ఒక మంచి అవకాశం కోసం… తనని తాను నిజంగా ప్రూవ్ చేసుకునే క్షణం కోసం. ఆ నిరీక్షణకు పేరు ‘ఛాంపియన్’.
స్వప్న సినిమాస్ నిర్మాణంలో, వైజయంతి మూవీస్ ప్రెజెంటేషన్‌లో రోషన్ గ్రాండ్ రీ-లాంచ్ అవుతున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ క్యూరియాసిటీని పెంచిందే తప్ప తగ్గించలేదు. ముఖ్యంగా ట్రైలర్ — రోషన్‌ని చూసిన తర్వాత చాలామందికి ఒక్క మాటే: మైండ్ బ్లోయింగ్. లుక్, క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్.. అన్నీ నెక్స్ట్ లెవెల్. ఇది రోషన్ ఇప్పటివరకు మనం చూసిన రోషన్ కాదు. ఇది పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయిన యాక్టర్.
దీనికి తోడు వైజయంతి మూవీస్ అంటే సక్సెస్ కి మారుపేరు. ఎన్టీఆర్‌కి స్టూడెంట్ నెంబర్ వన్, అల్లుఅర్జున్‌కి గంగోత్రి, మహేష్‌బాబుకి రాజకుమారుడు, రామ్ చరణ్‌కి చిరుత.. ఇలా స్టార్‌ల తొలి అడుగులను బలమైన ముద్రగా మార్చిన బ్యానర్ ఇది. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న వైజయంతి బ్యానర్‌లో రోషన్ రావడం. నాలుగేళ్ల నీరిక్షణ తనగి ఫలితం దొరుకుందనే నమ్మకం పుష్కలంగా వుంది. ‘ఛాంపియన్’ — రోషన్‌ని నిజమైన హీరోగా నిలబెట్టే పరీక్ష. ఇప్పటివరకూ వచ్చిన కంటెంట్ అదిరిపోయింది. రోషన్ ఖాతాలో ఎలాంటి హిట్ పడుతుందో డిసెంబర్ 25న తేలిపోతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

