RRRకు ఆస్కార్ రావడానికి కారణం నేనే : అజయ్ దేవగన్

RRRకు ఆస్కార్ రావడానికి కారణం నేనే : అజయ్ దేవగన్
X

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తాజాగా నటించిన చిత్రం భోలా. ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు అజయ్. అందులో భాగంగానే కపిల్ శర్మ కామెడీ షోలో పాల్గొన్నారు. అజయ్ దేవగన్ RRR సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ కు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు రాగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ కపిల్ శర్మ అజయ్ దేవగన్ కు అభినందనలు తెలిపారు.

RRR నా వల్ల ఆస్కార్ గెలుచుకుంది

"అజయ్ భయ్యా మీకు శుభాకాంక్షలు మీరు నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ను గెలుచుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకోవడం సంతోషం" అని కపిల్ అన్నారు. అజయ్ మాట్లాడుతూ.. "అవును నావల్లే ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ లభించింది. ఎందుకంటే నేను ఆ పాటకు డ్యాన్స్ చేసి ఉంటే ఎలా ఉండేదో తెలుసుగా .." అని అన్నారు. అజయ్ మాటలకు అక్కడ ఉన్నవారంగా నవ్వుకున్నారు.

Next Story