రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' బ్యూటీ హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు.. ఫోటోలు వైరల్

రాజమౌళి ఆర్ఆర్ఆర్ బ్యూటీ హైదరాబాద్ వీధుల్లో చక్కర్లు.. ఫోటోలు వైరల్
దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జక్కన్న తీసే చిత్రాల్లో కథ, కథనంతో పాటు తారాగాణం కూడా ఓ స్పెషల్ అట్రాక్షన్. దాదాపు వెయ్యి రోజులకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో స్టారో హీరోలు రామ్ చరణ్, తారక్ ఎన్టీఆర్ నటించడం విశేషం.ఈ పాన్ ఇండియా చిత్రంలో బ్రిటీష్ బ్యూటీ ఒలీవియా మోరిస్, బాలీవుడ్ అందాల తార అలియా భట్ హీరోలకు జోడీ కడుతున్నారు. చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. మరికొందరు ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు.అజయ్ దేవగణ్, శ్రియ, సముద్ర ఖని వంటి హేమా హేమీలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇక కథ విషయానికి వస్తే 1920కి పూర్వం జరిగిన స్వాతంత్రోద్యమ అంశాలతో పాటు అల్లూరి, భీమ మధ్య సాగే స్నేహబంధంతో కూడిన కల్పిత కథను హైలెట్ చేయబోతున్నారు.ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న ఒలీవియా ఒక భారతీయ చిత్రంలో నటించడం ఇదే మొదటి సారి అని, చిత్రం రిలీజ్ డేట్ కోసం తాను కూడా ఓ సాధారణ ఆడియన్‌లా ఎదురుచూస్తున్నానని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో హైదరాబాద్‌‌ని సరదాగా చుట్టేస్తోంది ఒలీవియా.

ప్రముఖ స్టైలిస్ట్ అను రెడ్డితో కలిసి శిల్పారామంలో సందడి చేస్తోంది. హైదరాబాదీ బిర్యానీ రుచి చూసింది. వర్షంలో నగరం అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story