RRR Glimpse: ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ వచ్చేసింది.. కళ్లు చెదిరిపోయే విజువల్స్‌తో..

RRR Glimpse (tv5news.in)
RRR Glimpse: దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజమౌళి డైరెక్షన్ ఒక ఎత్తైతే.. ఇందులో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం మరో హైలైట్. బాహుబలితో తెలుగు సినిమా రేంజ్‌ను మార్చేసిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌తో తన రికార్డులు తానే తిరగరాయనున్నాడని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్‌ను విజువల్ వండర్‌గా సిద్ధం చేస్తున్నాడు.
ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ నుండి క్యారెక్టర్ టీజర్లు, మేకింగ్ వీడియో మాత్రమే విడుదలయ్యింది. కానీ అప్పుడే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇతర సినిమాలలాగా ఆర్ఆర్ఆర్ నుండి పెద్దగా అప్డేట్లు రావట్లేవు. కానీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉత్కంఠ ఏ మాత్రం తగ్గలేదు.
తాజాగా ఆర్ఆర్ఆర్ నుండి గ్లింప్స్ విడులదయ్యింది. కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో 46 సెకండ్ల ఈ గ్లింప్స్ పవర్ ప్యాక్డ్‌గా ఉంది. ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌లలో మరో కొత్త కోణాన్ని ఆర్ఆర్ఆర్‌తో మనకు పరిచయం చేయనున్నాడు రాజమౌళి. ఈ గ్లింప్స్‌లో అజయ్ దేవగన్, ఆలియా భట్, ఓలివియా మోరీస్ కూడా మెరిసారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com