RRR In OTT : RRR ఓటీటీ హిందీ వెర్షన్ ఎప్పుడంటే?

RRR In OTT : ఇటీవల 500 థియేటర్లలలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం) మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది. మే 20 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ బాషల్లో ZEE5 లో స్ట్రీమింగ్ కానుంది. RRR హిందీ వెర్షన్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా, జూన్ 2నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ట్విట్టర్ అధికారికంగా వెల్లడించింది.
కాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. వరల్డ్ వైడ్ గా రూ. 1100 కోట్ల పైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ మధ్యకాలంలో భారీ స్థాయిలో 50 రోజులను పూర్తి చేసుకున్న సినిమా ఆర్ఆర్ఆర్ మాత్రమే కావడం విశేషం.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన, రాజమౌళి టేకింగ్ హైలెట్ అయి సూపర్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించి ఆకట్టుకున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.కీరవాణి సంగీతం అందించారు.
Did you hear that ROAR? THAT'S US SCREAMING IN EXCITEMENT! 😱🤯😱🤯😱😳
— Netflix India (@NetflixIndia) May 16, 2022
RRR is coming to Netflix in Hindi and WE. ARE. READY. pic.twitter.com/ksSd0U5irA
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com