RRR Japan Box Office Update: జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం

RRR Japan Box Office Update: జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం
ప్రపంచవ్యాప్తంగా 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్'

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' (RRR)లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించగా అలియా భట్, అజయ్ దేవగన్ సహాయక పాత్రలలో నటించారు. తాజా అప్ డేట్ ప్రకారం ఈ సినిమా 305 రోజుల పాటు రన్ చేసి ఇప్పటివరకు 2.345 బిలియన్ యెన్‌లను అంటే ఇది భారతదేశంలో దాదాపు రూ. 140 కోట్లు వసూలు చేసి జపాన్ బాక్సాఫీస్ వద్ద విశేషమైన ఫీట్‌ను నమోదు చేసింది. ఈ లెక్కన చూస్తుంటే సినిమా ఫుల్ రన్‌లో మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జపాన్ బాక్సాఫీస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఉన్న ప్రతి అంచనాలు తారుమారయ్యాయి. జపాన్ అత్యంత అంతర్జాతీయ మార్కెట్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. 'RRR' అద్భుతమైన పనితీరే దానికి ఒక ఉదాహరణ మాత్రమే. ఉదయించే సూర్యుని దేశంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా ఈ మూవీ నిలిచింది.

2022 చివరి నాటికి, 'కేజీఎఫ్ 2'(KGF 2) గ్లోబల్ కలెక్షన్స్ పరంగా 'RRR' కంటే ఎక్కవ కలెక్షన్లు దక్కించుకుంది. 'KGF 2' మొదట్లో 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఎంపికైంది. జపాన్‌లో 'RRR' అద్భుతమైన ప్రదర్శన దాని నిర్మాతలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. క్రమ క్రమంగా, జపాన్‌లో RRR కలెక్షన్లు పెరగడం ప్రారంభించాయి. చివరికి 2022లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. RRR ప్రపంచవ్యాప్తంగా 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం అయితే, KGF 2.. 2022లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రం.

జపాన్‌లో RRR వారం వారీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

వారం 1 - JPY 75 మిలియన్

2 - JPY 70 మిలియన్

3 - JPY 70 మిలియన్

4 - JPY 44 మిలియన్

5 - JPY 50 మిలియన్

6 - JPY 49 మిలియన్

7 - JPY 29 మిలియన్

8 - JPY 27 మిలియన్ -

9 - JPY 20 మిలియన్

10 - JPY 25 మిలియన్

11 - JPY 33 మిలియన్

12 - JPY 22 మిలియన్

13 - JPY 67 మిలియన్

14 - JPY 113 మిలియన్

15 - JPY 117 మిలియన్

16 - JPY 89 మిలియన్

17 - JPY 76 మిలియన్

18 - JPY 83 మిలియన్

19 - JPY 86 మిలియన్

20 - JPY 76 మిలియన్

21 - JPY 114 మిలియన్

22 - JPY 96 మిలియన్

23 - JPY 94 మిలియన్

24 - JPY 80 మిలియన్

25 - JPY 86 మిలియన్

అలా 44 వారాలకు కలిపి మొత్తం - సుమారు JPY 2345 మిలియన్

రాబోయే కొద్ది వారాల్లో జపాన్‌లో RRR పర్ఫార్మెన్స్ ఎలా కొనసాగుతుందనేది ఆసక్తికరంగా ఉంది. జపాన్‌లో దాని రన్ ఒక సంవత్సరం కొనసాగినా అందులో ఆశ్చర్యం లేదు. మీరు జపాన్‌లో ఉంటే.. మీకు సమీపంలోని థియేటర్‌లో RRRని చూడవచ్చు.


Tags

Read MoreRead Less
Next Story