RRR Trailer : ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేసింది..

ఆర్ఆర్ఆర్ ట్రైలర్ మళ్లీ రావడం ఏంటీ అనుకుంటున్నారా.. యస్.. ఈ మూవీకి సంబంధించిన బెస్ట్ ఎక్స పీరియన్స్ లను షేర్ చేసుకుంటూ ఆ సినిమా వెనక కథను తెలుపుతూ మరో మూవీ లాంటిది సెట్ చేశాడు రాజమౌళి. దానికి సంబంధించిన ట్రైలరే ఇది. విశేషం ఏంటంటే.. ఈ మూవీ/ డాక్యుమెంటరీని ఈ నెల 20న కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. అందుకే ట్రైలర్ కూడా వచ్చేసిందన్నమాట. ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్స్ తో ఈ మూవీ అనౌన్స అయినప్పుడు అందర్లోనూ ఓ ఎగ్జైట్మెంట్ కనిపించింది. దాని వెనక ఉన్న కథేంటీ.. ఆ మూవీ చిత్రీకరణ టైమ్ లో ఎదురైన టఫ్ మూమెంట్స్ ఏంటీ.. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఒపీనియన్ ఏంటీ అనేది ఈ డాక్యుమెంట్ లో కనిపిస్తుంది. అలాగే ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న కొన్ని సన్నివేశాలను ఎలా చిత్రీకరించారు అనే తెర వెనక కథతో పాటు ఆస్కార్ వేదికపై ఎమోషనల్ మూమెంట్స్ ను కూడా చూపించబోతున్నారు. అంటే ఆ వీడియోస్ కూడా ఉంటాయన్నమాట.
ఈ ట్రైలర్ ఆర్ఆర్ఆర్ లో ఇద్దరు హీరోలు ఫస్ట్ టైమ్ కలిసే ట్రైన్ బ్లాస్టింగ్ సీన్ తో కనిపిస్తుంది. చూస్తుంటే ఇది కూడా రాజమౌళి మూవీస్ రేంజ్ లో మంచి వినోదాత్మకంగానూ, ఎగ్జైటింగ్ గానూ కనిపించేలా ఉంది. ఖచ్చితంగా ఇండియన్ సినిమాకు సంబంధించి ఈ బిహైండ్ ద సీన్ అనే ట్రెండ్ కు ఇది శ్రీకారం చుడుతుంది. అలాగే కొత్త మార్కెట్ ను కూడా క్రియేట్ చేస్తుంది. ఆ మేరకు మరోసారి రాజమౌళి ట్రెండ్ సెట్టర్ కాబోతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com