RRR Memes: ఆర్ఆర్ఆర్ మీమ్స్ అద్దిరిపోయాయిగా.. 4 ఏళ్ల నిరీక్షణ ఫలించినవేళ..

RRR Memes: జక్కన్న శిల్పం చెక్కితే అందులో వంకలు పెట్టడానికి ఏమీ ఉండదు.. నాలుగేళ్లయినా, అయిదేళ్లయినా ఆ ఎదురుచూపులో కూడా మజా ఉంటుంది. అంతబాగా తీస్తారు రాజమౌళి సినిమాలను.. సినిమా మీద ప్యాషన్ అతడిని అంతగా వర్క్ చేయిస్తుంది. నటీ నటుల సహకారం అందుకు తోడవుతుంది.
ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈ రోజే ఎదురవుతుంటే అన్నట్లుగా దాదాపు నాలుగు సంవత్సరాల నిరీక్షణ ఫలించి ఆర్ఆర్ఆర్.. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చరణ్, తారక్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ చిత్రం కోసం. ప్రమోషన్లలో జోరందుకున్న టీమ్ సుమతో కలిసి చేసిన ఇంటర్వ్యూ హైలెట్ గా నిలిచింది.
సుమ దర్శకుడు రాజమౌళిని ఒక ఆట ఆడుకుంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ పై వచ్చిన మీమ్స్ ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. RRR టీమ్‌పై చేసిన ఫన్నీ ట్రోల్స్ చూసి తారక్, చరణ్, రాజమౌళి హాయిగా నవ్వుకున్నారు.
ఈ ట్రోల్స్ చాలా వరకు దర్శకధీరుడు రాజమౌళిపైనే ఉన్నాయి. RRR 2020లో విడుదలవుతుందని, 2021 లేదా 2022 వరకు పొడిగించబోదని రాజమౌళి చేసిన పాత ఇంటర్వ్యూ ఒక మీమ్‌లో చూపించారు. Meme మేకర్స్ ఈ క్లిప్‌కి తమాషాగా ప్రేక్షకుల స్పందనను కూడా జోడించారు.
మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ప్రారంభం నుంచి చివరి వరకు ఉల్లాసంగా సాగింది. రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ మీమ్స్ చూసి కడుపుబ్బ నవ్వుకున్నారు. ఇదిలా ఉంటే, RRR మార్చి 25న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఇందులో అలియా భట్, అజయ్ దేవగన్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com