RRR Movie : రజినీ రోబో 2.0 కలెక్షన్లను బీట్ చేసిన ఆర్ఆర్ఆర్..!

RRR Movie : రజినీ రోబో 2.0  కలెక్షన్లను బీట్ చేసిన ఆర్ఆర్ఆర్..!
RRR Movie : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్‌‌ను షేక్ చేస్తోంది.

RRR Movie : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్‌‌ను షేక్ చేస్తోంది... గంగూబాయి కతియావాడి, ది కాశ్మీర్ ఫైల్స్, బాహుబలి (హిందీ) కలెక్షన్లును ఇప్పటికే అధిగమించిన ఆర్ఆర్ఆర్ .. తాజాగా రజనీకాంత్ రోబో 2.0 కలెక్షన్లను కూడా క్రాస్ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రోబో2.0 పేరిట ఉన్న రికార్డును ఆర్ఆర్ఆర్ తాజాగా బీట్ చేసింది. అయితే పది రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ మూవీ ఈ ఘనతను అందుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.. తాజాగా ఈ రికార్డుతో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలలో ఆరో చిత్రంగా నిలిచింది ఆర్ఆర్ఆర్.

ఈ సినిమా కంటే ముందు దంగల్, బాహుబలి: ది కన్‌క్లూజన్, బజరంగీ భాయిజాన్, సీక్రెట్ సూపర్‌స్టార్, PK చిత్రాలు మొదటి ఐదు స్థానాలను ఆక్రమించాయి. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీని వీవీ దానయ్య భారీ బడ్జెట్‌‌తో తెరకెక్కించారు.

ఈ సినిమాలో రామ్‌ చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటించి ఆకట్టుకున్నారు. వీరి సరసన అలియా భట్, ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

Tags

Read MoreRead Less
Next Story