RRR Movie : అఫీషియల్.. ఎన్టీఆర్ బర్త్ డే రోజునే ఓటీటీలోకి ఆర్ఆర్ఆర్..!

RRR Movie : అఫీషియల్..  ఎన్టీఆర్ బర్త్ డే రోజునే ఓటీటీలోకి ఆర్ఆర్ఆర్..!
RRR Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లో తెరకెక్కిన మూవీ ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)..

RRR Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మెయిన్ లో తెరకెక్కిన మూవీ ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం).. కరోనా వలన పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 1100 కోట్ల పైగా కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా ఓటీటీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

ఈనెల 20 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ బాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా ZEE5 ప్రకటించింది. RRR హిందీ వెర్షన్ అదే రోజు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇక్కడో విశేషం ఏంటంటే మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడం. కాగా RRR చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌‌తో తెరకెక్కించగా ఈ మూవీలో రామ్‌ చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటించి ఆకట్టుకున్నారు.

వీరి సరసన అలియా భట్, ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

Tags

Read MoreRead Less
Next Story