RRR Movie: 'ఆర్ఆర్ఆర్'కు అదొక్కటే పెద్ద మైనస్.. లేకపోతే అంతా పర్ఫెక్ట్..

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఓ స్టైల్ ఉంటుంది. ఎమోషన్స్‌ను పండించడంలో కానీ, యాక్టర్ల నుండి పూర్తిస్థాయిలో నటన రాబట్టడంలో కానీ.. రాజమౌళి తనకు తానే సాటి. ఈ లక్షణాలతోనే ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. అయితే ఈ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులు ఇందులో ఒకటి మిస్ అయ్యిందని ఫీల్ అవుతున్నారు.
రాజమౌళి సినిమాల్లో విలన్ అంటే హీరో పాత్రలకు ధీటుగా ఉంటుంది. విలన్ ఎంత బలంగా ఉంటే హీరో అతడిని కొట్టి అంతకంటే ఎక్కువ బలవంతుడని నిరూపించుకుంటాడని, అందుకే తన విలన్ క్యారెక్టర్స్‌ను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేస్తాడని రాజమౌళి ఎన్నోసార్లు చెప్పాడు. తనకు ఇష్టమైన జోనర్ రివెంజ్ అని కూడా రాజమౌళి అన్నాడు. అయితే ఆర్ఆర్ఆర్‌లో అదే మిస్ అయ్యింది.
'ఆర్ఆర్ఆర్'లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్.. ఇద్దరూ హీరోలే, ఇద్దరు విలన్‌లే. దీంట్లో స్కాట్ పాత్రలో నటించిన రే స్టీవెన్‌సన్ కాసేపు విలన్‌గా కనిపించినా.. రాజమౌళి విలన్‌కు ఉండే అంత రాజసం తనలో లేదు. అయితే రామ్ చరణ్, ఎన్‌టీఆర్ కలిసి అంత హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు దానికి తగిన ఓ విలన్ ఉంటే బాగుండేదని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అది పక్కన పెడితే.. ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల విషయంలో రికార్డులు బద్దలుకొడుతూ దూసుకుపోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com