RRR Movie: సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్‌టీఆర్.. ముంబాయ్‌లో భారీ కట్ ఔట్‌లు..

RRR Movie: సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్‌టీఆర్.. ముంబాయ్‌లో భారీ కట్ ఔట్‌లు..
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై తెలుగు ప్రేక్షకులకే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి.

RRR Movie: 'ఆర్ఆర్ఆర్' సినిమాపై తెలుగు ప్రేక్షకులకే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ప్రతీ భాషా ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేయాలని మూవీ టీమ్ ముందే నిర్ణయించింది. దానికి తగినట్టుగానే ఇటీవల దేశంలోని వివిధ నగరాల్లో ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేసి సినిమా విశేషాలు పంచుకున్నారు. తాజాగా ముంబాయ్‌లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు.



తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయకముందే బాలీవుడ్ మార్కెట్‌పై కన్నేశాడు జక్కన్న. అందుకే కరణ్ జోహార్ లాంటి ప్రముఖ దర్శక నిర్మాతను హోస్ట్‌గా 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశాడు. దీనికి సల్మాన్ ఖాన్ ఛీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. అయితే రామ్ చరణ్, ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే విషయం ఏంటంటే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లైవ్ టెలికాస్ట్ లేకపోవడం.

ఆర్ఆర్ఆర్ మ్యానియా మొదలయిన సందర్భంగా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఫోటో, కొమురం భీమ్‌గా ఎన్‌టీఆర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈరోజు ముంబాయ్‌లో జరిగే ప్రీ రిలీజ్‌లో కూడా అచ్చం ఇలాంటి కట్ ‌ఔట్‌లనే ఏర్పాటు చేశారు ఈ హీరోల బాలీవుడ్ అభిమానులు. ఇద్దరు తెలుగు హీరోలకు బాలీవుడ్ ల్యాండ్‌పై అంత పెద్ద కట్ ఔట్‌లు పెట్టడం ఇదే మొదటిసారి.


ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన అలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కిన ఈ భారీ చిత్రం జనవరి 7న రిలీజ్ కానుంది. ఇతర భాషల్లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో క్లారిటీ లేకపోయినా.. ముంబాయ్‌లో జరిగిన హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ఫోటోలు చూస్తే అర్థమవుతోంది.



Tags

Next Story