RRR In OTT: 'ఆర్ఆర్ఆర్' సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..

RRR In OTT: ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..
RRR In OTT: మొదటి రోజు కలెక్షన్స్ నుండే రికార్డులను బ్రేక్ చేయడం మొదలుపెట్టింది ఆర్ఆర్ఆర్.

RRR In OTT: శుక్రవారం ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురుచూపుకు ఫలితం దక్కింది. వారు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా శుక్రవారం విడుదలయ్యి యూనానిమస్‌గా పాజిటివ్ టాక్ అందుకుంటోంది. హీరోల అభిమానులు మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ అనే అంటున్నారు. ఈ సినిమాపై రివ్యూలు కూడా చాలా పాజిటివ్‌గా వస్తున్నాయి. అయితే ఇప్పుడే థియేటర్లలో విడుదలయిన ఆర్ఆర్ఆర్.. ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందో అన్న చర్చ మొదలయిపోయింది.

దర్శక ధీరుడు రాజమౌళి.. రెండేళ్లు పూర్తిగా కేటాయించి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'కు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. అందుకే మొదటి రోజు కలెక్షన్స్ నుండే రికార్డులను బ్రేక్ చేయడం మొదలుపెట్టింది ఆర్ఆర్ఆర్. అయితే ఈ పాన్ ఇండియా సినిమాను థియేటర్లలో చూసిన వారు కూడా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని అంచనా వేయడం మొదలుపెట్టేశారు.

లాక్‌‌డౌన్ సమయంలో థియేటర్లు మూతబడి ఉండడంతో ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో సినిమాలను థియేటర్లలో చూడలేక మిస్ అయినవారు.. ఎలాగో ఓటీటీలో వచ్చేస్తుందిలే అని ధీమాగా ఉంటున్నారు. అయితే థియేటర్లు తెరుచుకున్న తర్వాత ఒక సినిమా ఓటీటీలోకి రావాలంటే కనీసం 90 రోజులు అయినా ఆగాలి అని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు.

ఒక సినిమా థియేటర్‌లో విడుదలయిన తర్వాత 90 రోజుల తర్వాత అయినా.. లేదా ఆలోపే అయినా.. ఓటీటీలో విడుదల చేయవచ్చు. ఈ నిర్ణయం నిర్మాతల చేతుల్లోనే ఉంటుంది. అయితే ఆర్ఆర్ఆర్ ఒక పాన్ ఇండియా చిత్రం కాబట్టి కచ్చితంగా దీనిని వెంటనే ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాతలు ఒప్పుకోరని భావిస్తున్నారు అభిమానులు. ఈ లెక్కన చూసుకుంటే ఆర్ఆర్ఆర్ జూన్ 20 తరువాత ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ తెలుగు డిజిటల్ రైట్స్‌ను జీ5 సొంతం చేసుకోగా.. మిగతా భాషల హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story