RRR: కొమ్మా ఉయ్యాల.. కోనా జంపాల.. ఎవరిదీ క్యూట్ వాయిస్

RRR: కొమ్మా ఉయ్యాల.. కోనా జంపాల.. ఎవరిదీ క్యూట్ వాయిస్
RRR: ఈటీవీ నిర్వహించిన పాడుతా తీయగాలో పాడి ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం, కీరవాణి, సునీత, కోటిల మనసు దోచుకుంది

RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.. విడుదలైన అన్ని ధియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ తో వండర్స్ సృష్టించవచ్చని నిరూపించింది. మొగా పవర్ స్టార్ రామ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. తెరపైన వీరి స్నేహ బంధం అద్భుతంగా చూపించారు రాజమౌళి.

సినిమా ప్రారంభం మల్లి పాత్రతో మొదలవుతుంది.. ఈ గిరిజన బాలిక పాడే కొమ్మా ఉయ్యాల.. కోనా జంపాల అనే పాటకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ గాత్రం సంగీత ప్రియులను అలరించింది. ఈ లిరికల్ సాంగ్ విడుదల చేసే ప్రయత్నంలో ఉంది చిత్ర యూనిట్. సినీ ప్రియులను ఇంతగా ఆకట్టుకున్న ఈ పాటను పాడింది కర్ణాటకకు చెందిన ప్రకృతి రెడ్డి.

వయసు పన్నెండేళ్లే అయినా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటోంది.. తన గాత్రంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఈటీవీ నిర్వహించిన పాడుతా తీయగాలో పాడి ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం, కీరవాణి, సునీత, కోటిల మనసు దోచుకుంది. దాంతో ఆర్ఆర్ఆర్ లోని ఆపాట కోసం ప్రకృతిని పిలిచారు కీరవాణి. ఆర్ఆర్ఆర్ తో మరింత ఫేమస్ అయ్యింది ప్రకృతి రెడ్డి.

స్టార్ ప్లస్ సింగింగ్ రియాలిటీ షో తారే జమీన్ పర్‌లో పాల్గొంటున్న బాల గాయని ప్రకృతి రెడ్డి. తారే జమీన్ పర్ భారతీయ సంగీత రియాలిటీ షో. ఇందులో భారతదేశంలోని 20 మంది ప్రతిభావంతులైన పిల్లలు తమ ప్రతిభను కనబరుస్తున్నారు.

తారే జమీన్ పర్ కంటే ముందు, ఆమె జెమినీ టీవీలో 'బోల్ బేబీ బోల్' అనే షోలో కనిపించింది. ప్రకృతి ఓ యూట్యూబ్ ఛానెల్‌ని కూడా నడుపుతోంది. అందులో తాను పాడే పాటల వీడియోలను పోస్ట్ చేస్తుంది. హార్మోనియం వాయించడం అంటే చాలా ఇష్టం ప్రకృతికి. సినిమాల్లో పాటలు పాడుతూ, చదువుకుంటూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తోంది ఈ చిన్నారి.

Tags

Read MoreRead Less
Next Story