RRR Movie: ఆర్ఆర్ఆర్ అప్డేట్ అదిరిపోయిందిగా..

RRR Movie (tv5news.in)
RRR Movie: దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. రాజమౌళిలాంటి దర్శక ధీరుడి విజన్‌లో ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ లాంటి వపర్‌ఫుల్ యాక్టర్లు ఎలా నటిస్తారు అనే అంశం అందరిలో ఆసక్తిని మరింత పెంచేస్తోంది. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ నుండి ఒక అప్డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ నాలుగు సార్లు వాయిదా పడింది. చివరిగా వచ్చే సంక్రాంతి ఈ భారీ మల్టీ స్టారర్ ఎలాగైన విడుదల అవుతుందని ఇటీవల ప్రకటించింది మూవీ టీమ్. అదే ఆర్ఆర్ఆర్ నుండి వచ్చిన చివరి అప్డేట్. ఆ తర్వాత రాజమౌళి నుండి మరే సమాచారం లేదు. తాజాగా ఒక అప్డేట్ అందరినీ హ్యపీ చేయడానికి వచ్చేస్తోంది అని ప్రకటించారు.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో శాండల్‌వుడ్ మాత్రమే కాదు సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇలాంటి సమయంలో అప్డేట్ గురించి చెప్పడం కరెక్ట్ కాదనుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ దానిని పోస్ట్‌పోన్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఒకరోజు తర్వాత ఈరోజు ఆ అప్డేట్ ఏంటో ప్రేక్షకులకు తెలిసింది.
ఆర్ఆర్ఆర్ మూవీ టీజర్ కానీ, ట్రైలర్ కానీ ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా విడుదల అవ్వచ్చు అన్న రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ అవేవి కాకుండా నవంబర్ 1న ఉదయం 11 గంటలకు గ్లింప్స్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది ఆర్ఆర్ఆర్ టీమ్. ఇప్పటికే విడుదలయిన ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ క్యారెక్టర్ టీజర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. మరి వీరిద్దరు కలిసుండే గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు అనే వార్త అభిమానుల్లో జోష్‌ను పెంచేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com