RRR Movie: ఓవర్సీస్ మార్కెట్‌పై 'ఆర్ఆర్ఆర్' కన్ను.. అందుకే ఆ ప్లాన్..

RRR Movie (tv5news.in)
RRR Movie: 'ఆర్ఆర్ఆర్' సినిమాకు దేశవ్యాపంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా హైప్ తీసుకురావాలని చూస్తోంది మూవీ టీమ్. ఇప్పటికే దేశంలో చాలామంది మూవీ లవర్స్.. ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయినా ఇక్కడ కూడా ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు జక్కన్న. విడుదల దగ్గర పడే వరకు ఇలాగే ప్రమోషన్స్ చేస్తూ.. సినిమాను బాహుబలిని మించిన హిట్ చేయాలని నిర్ణయించుకున్నారు అనిపిస్తోంది.
ఇటీవల ముంబాయిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల ఆర్ఆర్ఆర్ సినిమా హిందీ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని పెంచేసింది. కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ లాంటి బాలీవుడ్ బడా సెలబ్రిటీలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇక సౌత్‌లో కూడా రాజమౌళి ఇదే రేంజ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతకంటే ముందు ఓవర్సీస్ మార్కె్ట్‌పై కన్నేసింది ఆర్ఆర్ఆర్ టీమ్.
పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న చిత్రాలు ఈ మధ్య ఓవర్సీస్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నాయి. అలాగే 'ఆర్ఆర్ఆర్' టీమ్ కూడా ఈమధ్య ఓ వినూత్న ప్రయత్నం చేసింది. అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్కోర్‌లో ఆర్ఆర్ఆర్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ ఫోటోను మూవీ టీమ్ తమ సోషల్ మీడియాల్లో షేర్ చేసింది. ఈ ప్రమోషన్స్ జోరు చూస్తుంటే.. ఆర్ఆర్ఆర్ అనుకున్నదానికంటే పెద్ద హిట్టే అయ్యేలా ఉంది అనుకుంటున్నారు ప్రేక్షకులు.
Ladies and Gentlemen in the USA… 🙌🏻
— RRR Movie (@RRRMovie) December 22, 2021
The Roar of #RRRMovie is now on the @TimesSquareNYC. Post a selfie with the display and tag @RRRMovie ! #RRRinUSA🇺🇸@Spotify @spotifyindia @LahariMusic @TSeries@sarigamacinemas @RaftarCreations pic.twitter.com/Ov97BTRJTA
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com