RRR Movie: గ్లింప్స్‌లోని షాట్స్‌తో ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్స్.. నెటిజన్స్ కామెంట్స్..

RRR Movie (tv5news.in)
RRR Movie: 'ఆర్ఆర్ఆర్' సినిమా కూడా ప్రమోషన్స్ విషయంలో కొత్తగా ఆలోచిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి టేకింగ్‌లో ఎంత ఫేమస్సో.. ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే డిఫరెంట్. ఇంకా ఏ ఇతర దర్శకులకు రాని ఐడియాలతో తన సినిమాలను కొత్తగా ప్రమోట్ చేసుకుంటారు రాజమౌళి. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ విషయంలో రాజమౌళికి కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఎదురవుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభమయిన దాదాపు సంవత్సరం వరకు ఆ సినిమా నుండి అప్డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అందుకే లాక్ డౌన్ నడుస్తున్న సమయంలో కూడా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తన క్యారెక్టర్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఎన్‌టీఆర్ వాయిస్ ఓవర్‌తో విడుదలయిన ఈ గ్లింప్స్‌ను ఇప్పటికీ ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ గ్లింప్స్‌కు 'భీమ్ ఫర్ రామరాజు' అనే టైటిల్‌తో విడుదల చేశారు.
భీమ్ ఫర్ రామరాజు విడుదలయిన కొన్నిరోజులకు 'రామరాజు ఫర్ భీమ్' విడుదల అయ్యింది. ఈ గ్లింప్స్ రామ్ చరణ్ వాయిస్‌తో మొదలవుతుంది. ఇందులో ఎన్‌టీఆర్ కొమురం భీంగా కనిపించారు. ఈ రెండు క్యారెక్టర్ గ్లింప్స్‌లే ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి ఫ్యాన్స్‌కు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్. అయితే ఈరోజు విడుదలయిన పోస్టర్లకు, ఆ గ్లింప్స్‌లకు పోలికలు ఉన్నట్టు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
రామ్ చరణ్, ఎన్‌టీఆర్ గ్లింప్స్‌లలో ఉన్న షాట్స్‌ను ఈరోజు పోస్టర్లుగా విడుదల చేసిందంటూ, దీనిని అప్డేట్ అని ఎలా అంటారు కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. అడగకుండానే అప్డేట్ ఇచ్చారని సంతోషపడిన ఫ్యాన్స్.. ఇదేమి కొత్త అప్డేట్ కాదంటూ నిరాశపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com