RRR Movie: ఆర్ఆర్ఆర్‌కు ఓటీటీ భారీ ఆఫర్.. రూ.200 కోట్ల డీల్..!

RRR Movie (tv5news.in)

RRR Movie (tv5news.in)

RRR Movie: అమేజాన్ ప్రైమ్.. పాన్ ఇండియా సినిమాలకు వందల కోట్లలో ఆఫర్లు ఇచ్చేస్తుంది.

RRR Movie: 2019లో ఆ సినిమా మొదలయ్యింది. అప్పుడు విడుదల, ఇప్పుడు విడుదల అంటూ తేదీలలో మార్పులు వస్తూనే ఉన్నాయి. కానీ ఇంకా ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఆ సినిమా పేరేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి తెరకెక్కించిన ఈ మల్టీ స్టారర్ ఇంకా థియేటర్లలో విడుదల కాకపోయినా.. ఈ సినిమాపై అప్పుడే అనేక రూమర్స్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ మధ్య థియేటర్ల కంటే ఓటీటీకే డిమాండ్ పెరిగిపోయింది. అందుకే పాన్ ఇండియా సినిమాలు అని కూడా చూడకుండా చిత్రాలను నేరుగా తమ ప్లాట్‌ఫార్మ్స్‌లోనే మొదట స్ట్రీమ్ చేయాలని అనేక ఓటీటీ సంస్ధలు కోరుకుంటున్నాయి. అందులో ముఖ్యంగా అమేజాన్ ప్రైమ్.. పాన్ ఇండియా సినిమాలకు వందల కోట్లలో ఆఫర్లు ఇచ్చేస్తుంది. తాజాగా అలాంటి ఓ ఆఫర్‌నే ఆర్ఆర్ఆర్‌కు కూడా అందించినట్టు సమాచారం.

అమేజాన్ ప్రస్తుతం సినిమాలను కొనుగోలు చేయడంలో చాలా ముందు ఉంటోంది. ఇటీవల ఈ సంస్థ పే-పర్‌ వాచ్‌ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ పే పర్ వాచ్ ఆఫర్‌నే ఆర్ఆర్ఆర్‌కు కూడా అందించిందట అమేజాన్ ప్రైమ్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ విడుదల నాలుగుసార్లు వాయిదా పడింది. అందుకే ఈ ఆఫర్‌తో ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌ను సంప్రదించిందట అమేజాన్.

ఆర్ఆర్ఆర్ బడ్జెట్‌ను బట్టి చూస్తే.. ఆ సినిమాకు 400 కోట్లు కలెక్షన్స్ వస్తేనే బడ్జెట్ పోగా లాభాల బాటలో రికార్డులు సృష్టించగలుగుతుంది. అయితే అమేజాన్ మాత్రమే పే పర్ వాచ్ ద్వారా కేవలం రూ.200 కోట్లు మాత్రమే వస్తాయని తెలిపిందట. అందుకే ఆ ఆఫర్‌ను ఒప్పుకోవడానికి మూవీ టీమ్ సిద్ధంగా లేదని సమాచారం. అయినా ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా థియేటర్లలోనే చూస్తే కిక్ ఉంటుందని చాలామంది ప్రేక్షకుల భావన.

Tags

Next Story