RRR Movie: 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఇక ఈ సమస్యలు తప్పవా..?

RRR Movie (tv5news.in)
RRR Movie: బాహుబలి తర్వాత రాజమౌళి సినిమా అనగానే ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగినట్టుగానే రాజమౌళి కూడా తన సినిమాలో ప్రతీ సీన్‌ను జాగ్రత్తగా తెరకెక్కించాడు. కొమురం భీమ్‌గా ఎన్‌టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్‌ను పర్ఫెక్ట్‌గా స్క్రీన్‌పైకి తీసుకురావడానికి రాజమౌళికి నాలుగేళ్లు పట్టింది. ఫైనల్‌గా ఆర్ఆర్ఆర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సమయానికి మరోసారి దానిపై కరోనా ప్రభావం పడింది.
ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' విడుదల తేది మూడుసార్లు వాయిదా పడింది. ప్రతీసారి సినిమా కచ్చితంగా వస్తుంది అనడం, వాయిదా పడడం ప్రేక్షకులకు చాలా కామన్ అయిపోయింది. కానీ జనవరి 7న ఆర్ఆర్ఆర్ విడుదల కచ్చితంగా జరగనుందని ప్రేక్షకులు భావించారు. కానీ ఇంతలోనే అది కూడా లేదని తేలిపోయింది. దీంతో సినిమా బిజినెస్‌పై భారీగానే ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.
ఇంతకు ముందు మూడుసార్లు ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని అనౌన్స్ చేసింది మూవీ టీమ్. కానీ అప్పటికీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కానీ ఈసారి పరిస్థితి అలా కాదు.. సినిమా షూటింగ్ పూర్తయ్యి, ప్రమోషన్స్ కూడా జరిగాయి. ఈ ప్రమోషన్స్ కోసం మూవీ టీమ్ అంతా దేశంలోని ప్రధాన నగరాలకు వెళ్లి అక్కడి ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యింది
'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్ ప్రమోషన్స్ కోసం పెట్టిన ఖర్చుతో ఓ చిన్న బడ్జెట్ సినిమా తీయొచ్చని వీరి ప్రమోషన్స్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ కూడా వచ్చాయి. కానీ విడుదల వాయిదా పడింది. 2022 సమ్మర్‌లో ఆర్ఆర్ఆర్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి అప్పుడు కూడా ఇంత ఖర్చుపెట్టి ప్రమోషన్స్ చేస్తారా? అంటే కచ్చితంగా చేస్తారనే చెప్పాలి. కాకపోతే దీనికోసం సెపరేట్ థీమ్‌ను సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి దీనిని ప్లాన్ చేయొచ్చు. దీంతో బడ్జెట్ భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి దీనిని మూవీ టీమ్ ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com