RRR : దుబాయ్ ఎక్స్పో: అభిమానులతో సందడి చేయనున్న RRR టీమ్

RRR : దుబాయ్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన భారీ మల్టీస్టారర్ 'ఆర్‌ఆర్‌ఆర్'.దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ భారీగా అంచనాలను పెంచాయి.ఇప్పుడు సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో జరుపుతున్నారు.
ఈ క్రమంలోనే మేకర్స్ మార్చి 18న 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ స్పెషల్ గ్రాండ్ ఈవెంట్‌ను దుబాయ్ ఎక్స్‌పో 2020లో నిర్వహించబోతున్నారు.సాయంత్రం 4:30 గంటలకు ఈ వేడుకను ఘనంగా జరగబోతోంది.కాగా,ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సంబంధించి ఇప్పటికే సర్వం సిద్దమైనట్టు తెలుస్తుంది.అంతేకాదు, సినిమా ఇండస్ట్రీలకి చెందిన పలువురు సెలబ్రిటీస్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా రాబోతున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు.అలాగే.. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్‌గా అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com