ఎన్టీఆర్ నుదుటిపై గాయం.. క్లారిటీ ఇచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ టీమ్

RRR: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుపుకుంటుంది. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఎన్టీఆర్, హీరోయిన్ ఒలీవియా మోరీస్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే బ్రేక్ సమయంలో తారక్-చెర్రీ మాట్లాడుకుంటుండగా.. రాజమౌళి దాన్ని షూట్ చేస్తున్నట్లు ఉన్న ఓ సరదా వీడియోని శనివారం చిత్రబృందం షేర్ చేసింది.
ఆ వీడియోలో ఎన్టీఆర్ నుదుటిపై గాయమైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో అది చూసిన ఎన్టీఆర్(NTR) అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ కి ఏమైందంటూ వరుస కామెంట్లు చెస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ అభిమాని ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌ని ట్యాగ్ చేస్తూ.. 'ఎన్టీఆర్‌కు ఆ దెబ్బేంటన్నా?' అని ట్వీట్ చేయగా.. 'అది గాయం కాదు మేకప్ మాత్రమే' అని మూవీ యూనిట్ స్పష్టం చేసింది.
ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ రిప్లైతో అభిమానులందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఈ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
. @AlwaysRamCharan @tarak9999 & @ssrajamouli chilling in-between shots!! ❤️ #RRRMovie pic.twitter.com/IoKTaiAQ9r
— RRR Movie (@RRRMovie) August 7, 2021
. @AlwaysRamCharan @tarak9999 & @ssrajamouli chilling in-between shots!! ❤️ #RRRMovie pic.twitter.com/IoKTaiAQ9r
— RRR Movie (@RRRMovie) August 7, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com