RRR ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఫైనల్ షూటింగ్ ఫినిష్.. రాజమౌళి టీం పార్టీ
RRR: దర్శకధీరుడు రాజమౌళి ప్రతీష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ ఉక్రెయిన్ షెడ్యూల్ పూర్తయింది. దీంతో ఈ మూవీలోని మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఆగష్టు మొదటి వారంలో ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం హీరోలతో సహా 'ఆర్ఆర్ఆర్' బృందం మొత్తం ఉక్రెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళితో పాటు 'ఆర్ఆర్ఆర్' టీం అంతా కలిసి సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. రాజమౌళి కేక్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఇక కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులంతా కలిసి పార్టీ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తర్వలోనే మూవీ విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. షూటింగ్ కంప్లీట్ కావడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ హైదరాబాద్ వచ్చేశారు.
డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సీత పాత్ర పోషిస్తుండగా, హాలీవుడ్ నటి ఒలివియా ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. శ్రియా శరణ్, అజయ్ దేవ్ గణ్ , సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "ఆర్ఆర్ఆర్' మూవీలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com