RRR Movie Ticket Price: 'ఆర్ఆర్ఆర్' సినిమాకు టికెట్ ధరలు ఫిక్స్.. ఎంతంటే..

RRR Movie Ticket Price: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల విషయం పెద్ద దుమారాన్నే రేపుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో సినిమా టికెట్ ధరలు కాస్త నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టేలాగానే ఉన్నాయి. ఈ విషయంపై ఈరోజు ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం జీవో నెం 120 గురించి చర్చించారు. సినిమాల టికెట్ ధరలు ఎలా ఉండాలని చర్చించుకున్నారు.
జీవో నెంబర్ 120 ప్రకారం.. చిన్న సినిమా టికెట్ ధరలు.. కనిష్ఠ ధర కంటే ఎక్కువగా గరిష్ఠ ధర కంటే తక్కువగా అమ్మాలని ప్రభుత్వం తెలిపింది. మధ్య స్థాయి సినిమాలు విడుదలైన రెండువారాల పాటు గరిష్ఠ ధరకు టికెట్‌లు అమ్మాలని.. ఆ తర్వాత దాన్ని కొంతవరకూ తగ్గించాలని సూచించింది. భారీ బడ్జెట్ చిత్రమైతే గరిష్ఠ ధరలో మూడువారాల పాటు టికెట్‌లు అమ్మి.. ఆ తర్వాత దాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అత్యాశకు పోయి.. దుర్వినియోగం చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారు కూడా నిర్ణయించిన టికెట్ ధరలనే పాటించాలని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఇప్పుడే టికెట్ ధరలను నిర్ణయించింది ఫిల్మ్ ఛాంబర్. 'ఆర్‌ఆర్‌ఆర్'కు సింగిల్ స్క్రీన్‌లో రూ.175, మల్టీప్లెక్స్‌లో అయితే రూ.295 టికెట్ ధర ఉంటుందని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com