RRR Movie Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చేస్తోంది..

RRR Movie Trailer: జనవరిలోని బాక్సాఫీస్ రేసులో 'ఆర్ఆర్ఆర్' కూడా పోటీ చేయనుంది. అందుకే వెంటవెంటనే వీడియో సాంగ్స్, టీజర్లు.. ఇలా ఏదో ఒక రూపంలో అప్డేట్స్ ఇస్తూనే ఉంది మూవీ టీమ్. తాజాగా విడుదలయిన 'జనని' పాట ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా ట్రైలర్ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసింది మూవీ టీమ్.
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఆర్ఆర్ఆర్ గురించే. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మామూలుగా లేవు. దానికి తగినట్టుగానే రాజమౌళి కూడా ప్రమోషన్స్‌లో ఆచితూచి అడుగులేస్తున్నాడు. సినిమాలోని టీజర్‌లలో ఇందులో రామ్ చరణ్, ఎన్‌టీఆర్ నటనలోని ఇంటెన్సిటీ చూస్తుంటే ఇద్దరు పోటీపడి నటిస్తున్నారని అర్థమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com